
నాగ్ అశ్విన్ తెరకెక్కించబోతున్న సినిమాలో ‘బాహుబలి’ ప్రభాస్ పక్కన బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకునే నటిస్తోంది. ఈ చిన్న అప్ డేట్ తో మూవీ బజ్ గగనానికి చేరింది. ఈ క్రేజీ కాంబో గురించి ఇంటర్నేషనల్ మీడియా సైతం వార్తలు రాసింది. గడిచిన వన్ వీక్ నుంచి ఈ టాపిక్ గురించి చర్చ జరుగుతూనే ఉంది. అయితే దీపిక ఈ సినిమాను ఈజీగా ఒప్పుకోలేదట. భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే ఊహించని విధంగా రూ. 30 కోట్ల పారితోషకం డిమాండ్ చేసిందని సమాచారం. ముందుగా ప్రభాస్ తో సమానమైన రెమ్యూనరేషన్ ఇచ్చి, స్త్రీ సమానత్వం చాటాలని కోరిందట. అయితే ప్రభాస్ కి రూ. 50 కోట్ల వరకు పారితోషకం ఇస్తూ ఉండగా, అదే స్థాయిలో ఇవ్వాలంటే మార్కెట్ లెక్కలు ప్రకారం కుదరదని నిర్మాతలు అభిప్రాయపడ్డారట. దీంతో ఆమె రూ. 20 కోట్లకు ఓకే చెప్పిందని బోగట్టా.
ఇక కథ విషయంలో కూడా ఇంకాస్త ప్రాధాన్యం పెంచాలని దర్శకుడు నాగ్ అశ్విన్ ని దీపికా కోరిందట. అందుకు అతడు కూడా అంగీకరించినట్టు సమాచారం. ఆమె కన్విన్స్ చేయడానికి వైజయంతి మూవీస్ తీవ్ర ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యింది. తెలుగు ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ అందిచాలనే వారి సంకల్పం త్వరలోనే నెరవేరబోతుంది.