Shine Tom Chacko: డ్రగ్స్ మత్తులో నటితో అసభ్య ప్రవర్తన.. మూడో అంతస్తు నుంచి దూకి పారిపోయిన దసరా విలన్..

న్యాచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమాతో తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు మలయాళీ నటుడు షైన్ టామ్ చాకో. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విలన్ పాత్రలో అదరగొట్టారు. దీంతో తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషలలో ఆయనకు ఆఫర్స్ క్యూ కట్టాయి. అయితే ప్రస్తుతం ఈ నటుడు చిక్కుల్లో పడ్డారు.

Shine Tom Chacko: డ్రగ్స్ మత్తులో నటితో అసభ్య ప్రవర్తన.. మూడో అంతస్తు నుంచి దూకి పారిపోయిన దసరా విలన్..
Shine Tom Chacko

Updated on: Apr 17, 2025 | 10:46 PM

మాలీవుడ్‌లో ఇంకా నీలి నీడలు.. జస్టిస్‌ హేమా కమిటి నివేదిక తరువాత కూడా కేరళ సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులకు కళ్లెం పడలేదు. మీ టూ ఉద్యమం కంటిన్యూస్‌గా కొనసాగుతూనే ఉంది. విక్టిమ్‌గా లేటెస్ట్‌గా ఫ్రేమ్‌లోకి వచ్చారు నటి విన్సీ సోనీ అలోసియస్‌. దసరా విలన్‌బుల్లోడు షైన్‌ టామ్‌ చాకోపై సంచలన ఆరోపణలు చేయడమేకాదు కేరళ ఫిల్మ్‌ ఛంబర్‌అమ్మ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశారామె. ఓవైపు విన్సీ సోనీ ఆరోపణలు దుమారం రేపాయి.మరోవైపు టామ్‌ చాకోపై మరో వివాదం తెరపైకి వచ్చింది.కొచ్చిలోని ఓ హోటల్‌లో ఆయన డ్రగ్స్‌ తీసుకుంటున్నారన్న సమాచారంతో పోలీసులు రెయిడ్‌ చేశారు. కానీ ఖాకీలకు చేరేలోపే టామ్‌ చాకో అక్కడి నుంసి సినీ ఫక్కీలో ఎస్కేపయ్యాడు. మూడో అంతస్తులో రూమ్‌ తీసుకున్న అతను..విండో నుంచి సెకండ్‌ ఫ్లోర్‌ జంప్‌ చేసి అక్కడ నుంచి మెట్లు దిగుతూ వెళ్లారని పోలీసులు సీసీ ఫుటేజీ ద్వారా గుర్తించారని తెలుస్తోంది.

తెలుగు బ్లాక్‌బస్టర్‌ మూవీ దసరాలో విలన్‌గా నటించిన టామ్‌చాకో.. మాలీవుడ్‌ తనకంటూ ఓ ఇమేజ్‌ సంపాదించుకున్నాడు . జంప్‌ రాజా జంప్‌ అన్నట్టుగా ఆయన హోటల్‌ నుంచి ఎస్కేపైనా.. అతను బస చేసిన గదిలో కీలక ఆధారాలను సేకరించారు పోలీసులు. లైంగిక వేధింపుల వ్యవహారంతో పాటు డ్రగ్ వినియోగం మాలీవుడ్‌కు చెరగని మరక కొనసాగుతూనే ఉన్నాయి. తన కో -ఆర్టిస్ట్‌ సెట్‌లో డ్రగ్స్ వాడుతున్నాడని, తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ వీడియో రిలీజ్ చేసింది నటి విన్సీ పోనీ. కానీ, సదరు నటుడు ఎవరో. ఏ సినిమా షూటింగ్‌లో ఆ ఘటన జరిగిందో వీడియోలో రివీల్‌ చేయలేదామె.

కేరళ ఫిల్మ్‌ ఛాంబర్‌, మా అసోసియేషన్‌కు ఇచ్చిన ఫిర్యాదులో సదరు నటుడు ఎవరో రివీల్‌చేశారామె. టామ్‌ చాకో తనతో ఇన్‌ డీసెంట్‌ బిహేవియర్‌ చేశారని ఫిర్యాదు చేశారు.అంతేకాదు తను సెట్స్‌లో డ్రగ్స్‌ వాడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారామె. సూతాను డ్రెస్‌ ఛేంజింగ్‌ కోసం కార్వాన్‌కు వెళ్తూ ..అమర్యాదగా, అసభ్యంగా కామెంట్‌ చేశాడన్నారు. సెట్‌లో ప్రతీ రోజు టార్చర్‌ చేసేవాడని ఆరోపించారామె.