Pushpa Song: సమంత స్పెషల్ సాంగ్‏కు డాన్సింగ్ డాడ్ స్టెప్పులు.. వీడియో అదుర్స్..

|

Jan 10, 2022 | 12:19 PM

ప్రస్తుతం పుష్ప మేనియా కొనసాగుతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. డైరెక్టర్ సుకుమార్ కంబోలో వచ్చిన పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

Pushpa Song: సమంత స్పెషల్ సాంగ్‏కు డాన్సింగ్ డాడ్ స్టెప్పులు.. వీడియో అదుర్స్..
Viral
Follow us on

ప్రస్తుతం పుష్ప మేనియా కొనసాగుతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. డైరెక్టర్ సుకుమార్ కంబోలో వచ్చిన పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దక్షిణాదిలోనే కాకుండా ఉత్తరాదిలోనూ పుష్ప కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. ఊరా మాస్ లుక్‏లో బన్నీ నటకు అభిమానులు ఫిదా అయ్యారు. పుష్ప మూవీ మాత్రమే కాదు.. ఇందులోని పాటలు యూట్యూబ్‏ను షేక్ చేస్తున్నాయి. ప్రతి పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా సమంత ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ‘ఉ అంటావా.. ఉ ఊ అంటావా మామ అంటూ సాగే ఈ పాటలో సమంత అదిరిపోయే స్టెప్పులతో ఆకట్టుకుంది.

దేవీశ్రీ సంగీతం అందించిన ఈ సినిమాలో సమంత పాట ఒక హైలైట్ గా నిలిచిందనే చెప్పాలి. ఈ పాట లిరికల్ వీడియో సోషల్ మీడియాలో రికార్డ్స్ క్రియేట్ చేసింది. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటను ఫోక్ సింగర్ ఇంద్రావతి చౌహాన్ మత్తెక్కించే వాయిస్‏తో మెస్మరైజ్ చేసింది. ఈ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. చిన్న, పెద్ద తేడా లేకుండా ఊ అంటావా మావ.. ఊహు అంటావ పాటకు స్టెప్పులేస్తు అదరగొడుతున్నాయి. తాజాగా ఈ పాటకు అమెరికాకు చెందిన రికీ పాండ్ తనదైన స్టైల్లే డ్యాన్ చేసి ఆకట్టుకున్నాడు.

అమెరికాకు చెందిన రికీ పాండ్ భారతీయ పాటలకు డ్యాన్స్ చేస్తుంటారు. తన కుటుంబంతో కలిసి ఇండియన్ సాంగ్స్‎కు డ్యాన్స్ చేస్తూ ఆ వీడియోలను నెట్టింట్లో షేర్ చేస్తుంటారు. తాజాగా సమంత నటించిన ఊ అంటావా మావ.. ఊహు అంటావా పాటకు స్టెప్పులేసి అదుర్స్ అనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో షేర్ చేస్తూ అల్లు అర్జున్, సమంత, రష్మిక మందన్న, మైత్రీ మూవీ ఆఫిషియల్స్, కొరియోగ్రాఫర్ పోలకి విజయ్ లకు ట్యాగ్ చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ మైండ్ బ్లోయింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Sanjana Galrani: శుభవార్త చెప్పిన బుజ్జిగాడు హీరోయిన్.. త్వరలోనే తల్లి కాబోతున్న శాండల్ వుడ్ హీరోయిన్..

Bangarraju: జ‌న‌వ‌రి 14.. అన్న‌పూర్ణ స్టూడియోస్‌కి చాలా ముఖ్య‌మైన రోజు.. నాగార్జున ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..

డల్ గా పోస్ట్ లు పెడుతున్న షణ్నూ.. ఫీలవుతున్న ఫ్యాన్స్.. చెయ్‌రా చిచ్చా.. మస్తు మజా అంటూ..

Pushpa: పుష్ప సినిమా కాదు ఒక అనుభవం.. బ‌న్నీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించిన అర్జున్ క‌పూర్..