AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఊహించని ట్విస్ట్.. డాన్సర్స్ అసోసియేషన్ టెంపరరీ ప్రెసిడెంట్‌గా రఘు మాస్టర్‌

డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై రఘుమాస్టర్ మాట్లాడుతూ.. ఫెడరేషన్ అండర్‌లో ఎన్నికలు చేసుకుందాం అనేది శేఖర్ మాస్టర్ అంటే.. వాళ్లు వదిలేసినపుడు మనమే చేసుకుందాం అని జానీ అన్నారు.. అంతే తప్ప అది పర్సనల్ కాదు. లీడర్ షిప్ క్వాలిటీస్ ఎవరికీ లేవు.. పదవీ కాంక్షలు ఎవరికీ లేవు.. ఎవరికి వాళ్లే బిజీగా ఉన్నాం అన్నారు.

ఊహించని ట్విస్ట్.. డాన్సర్స్ అసోసియేషన్ టెంపరరీ ప్రెసిడెంట్‌గా రఘు మాస్టర్‌
Raghu Master
Rajeev Rayala
|

Updated on: Aug 30, 2026 | 7:43 PM

Share

డాన్సర్స్ అసోసియేషన్ వివాదం కీలక మలుపు తిరిగింది. రఘు మాస్టర్‌ను టెంపరరీ ప్రెసిడెంట్‌గా సభ్యులు ఎన్నుకున్నారు. ఆ తర్వాత రఘు మాస్టర్ మాట్లాడుతూ.. డాన్సర్, మాస్టర్ కాదు.. ఇక్కడ అందరూ మెంబర్స్.. మనకు యూనియన్ కావాలి.. అది ముందుకెళ్లాలి. సుమలత గారితో మాట్లాడినపుడు కూడా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటున్నామా లేదా.. ఏం జరుగుతుందనేది మనం అందరికీ చెప్తున్నామా లేదా అనేది అడిగాను అని అన్నారు. అలాగే అందరికీ వైరల్ అయింది ఏంటంటే.. వాళ్లకు ఫెడరేషన్ సపోర్ట్ లేదనే ప్రెస్ నోట్ రిలీజ్ చేసినపుడు మీరు ఇచ్చే హామీ ఏంటి…? అని ప్రశ్నించారు రఘు. సుమలత చేసే పనులు నాకు నచ్చుతాయి.. కానీ అందరితో ఉంటూ ట్రాన్స్‌పరెంట్‌గా ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు.. ఇక్కడికి ఇన్‌ఫ్లూయెన్స్ అయి ఎవరూ రాలేదు.. ఇది మిస్ యూజ్ కాకుండా దీన్ని త్వరగా ముందుకు తీసుకెళ్లేలా నేను వచ్చాను అన్నారు. అలాగే నేను ప్రెసిడెంట్‌గా పోటీ పడుతున్నానని అనుకున్నారు కానీ అలా రాలేదు ఇక్కడికి.. నేనైనా శేఖర్ అయినా, జానీ వచ్చినా సరే ఎవరైనా యూనియన్ కోసమే పని చేయాలి.

ఆ హీరో అర్ధరాత్రి అడవి మధ్యలో నాకు నాటుకోడి కావాలి అని అడిగాడు.. నేను షాక్ అయ్యా

వేజెస్ ప్రాబ్లమ్‌లో మనల్ని పక్కన బెడుతున్నారు.. ఇదే అందరూ ఎడ్యూకేట్ చేసారు కూడా.. ఫెడరేషన్ కింద ఉంటేనే మనకు వ్యాల్యూ ఉంటుంది. మనకంటూ ఓ హెడ్ ఉండాలి.. ఇది ఓ రూల్.. 24 క్రాఫ్ట్స్‌కు హెడ్ ఫెడరేషన్ ఏదైతే ఉందో.. టోటల్ ఇండియాలో ఉన్న ఫెడరేషన్ అన్నింటికీ కూడా ఓ హెడ్ ఉంటుంది.. ఏదైనా సమస్య వస్తే అది వైరల్ ప్రాబ్లమ్ అయితే టోటల్ ఇండియా వైడ్‌గా ఇతను ఎక్కడా పని చేయకుండా వాళ్లకు లెటర్ ఇవ్వొచ్చు.. అలాంటి ఓ హెడ్ ఉండాలి అన్నారు. అలాగే రేపు పొద్దున్న ప్రెసిడెంట్ ఎవరొచ్చినా.. నిర్మాతల దగ్గరికి వెళ్లే మాట్లాడగలగాలి.. 10 శాతం సరిపోదు.. 15 శాతం పెంచండి అని మాట్లాడాలి.. అలా కుదరదు అనుకున్నపుడు కనీసం 7.5 శాతం అయినా పెంచగలగాలి.. అలా హామీలు ఇస్తూ హెల్తీగా ఉండాలి.. ఇలా కావాలి కాబట్టే ఫెడరేషన్ అనేది మనకు కావాలి.. వాళ్ల అండర్‌లోనే మనం ఉండాలి.. 1997లో నేను కార్డ్ తీసుకున్నపుడు నాకు సెక్యూరిటీ ఉందనే భరోసా తీసుకునే ఇక్కడికి వచ్చాను.. అందరి అండర్‌లో ఉన్నపుడే సెక్యూరిటీ ఉంటుంది.. సెక్యూరిటీ లేని మెంబర్ షిప్ ఎవరూ తీసుకోరు.. అలాంటి అండ మనకు ఉండాలి అన్నారు రఘుమాస్టర్.

అతను చాలా మంచి మనిషి..! అంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ నన్ను చూసి లేచి నిలబడతాడు..

హెల్తీగా ఉండాలంటే మనకు అడా కమిటీ అనే ఓ టెంపరరీ కమిటీ ఉండాలి.. అందరూ కోరుకుంటున్నాం ఫెడరేషన్ కావాలని సంతకాలు పెట్టి పెద్దలకు ఇవ్వాలి.. మనం ఇలా ఫామ్ చేసుకుంటే అసోసియేషన్ గుర్తింపేలాగా మనం చేసుకుంటే రీ ఎలక్షన్స్ పెట్టుకుందాం.. మంచి చేసేలా ఎవరు నిలబడినా మంచిదే.. అందరూ హెల్తీగా ముందుకు పోదాం.. ఎవరికీ పర్సనల్ గ్రెడ్జెస్ లేవు.. అందరం ముందుంటాం.. ఈ సమస్య మనందరిదీ.. ఫెడరేషన్ గుర్తించాలనే తపన మనిది.. 35 ఏళ్ళలో ఇదే ఫస్ట్ టైమ్ మన అసోసియేషన్‌ను గుర్తించకపోవడం.. 24 క్రాఫ్ట్స్‌లో ఒకర్ని తీసేసి 23 క్రాఫ్ట్స్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్.. ఇక్కడికి రాని వాళ్లు వెళ్ళి ఇక్కడ జరిగిన విషయం చెప్పాలి.. ప్రతీ దానికి అగ్రెసివ్‌గి రియాక్ట్ అవ్వాలి.. అందరూ ఇష్టపూర్వకంగానే సిగ్నేచర్స్ చేయండి.. వారంలోపే ఫార్మేషన్‌తో సహా కలుసుకుందాం.. అందరికీ అండ కావాలి.. శేఖర్ మాస్టర్‌తో పాటు చాలా మంది మిస్ అయ్యారు అని అన్నారు రఘు మాస్టర్. అయితే

ఇవి కూడా చదవండి

16 ఏళ్లకే ఎంట్రీ 26ఏళ్లకే కెరీర్ క్లోజ్..! పెళ్ళైన 15 రోజులకే పారిపోయిన భర్త..!! ఈ హీరోయిన్ లైఫ్ లో సినిమాకు మించిన ట్విస్ట్‌లు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల