
సినిమా ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేస్తున్నాయి. తాజాగా ఓ డాన్స్ మాస్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని మియాపూర్‌లో డాన్స్ మాస్టర్ సాగర్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ వైఫల్యం కారణంగా డాన్స్ మాస్టర్ సాగర్ కుమార్ (17) ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సాగర్ కుమార్ మియాపూర్‌లోని గోకుల్ ఫ్లాట్స్‌లో ఉన్న డిలైట్ డాన్స్ స్టూడియోలో పనిచేస్తున్నాడు. డాన్స్ మాస్టర్ గా తన ప్రతిభను చాటుకున్నాడు సాగర్. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలోనే సాగర్ ఆత్మహత్య చేసుకోవడం అందరిని కలిచివేస్తుంది.
మే 26, 2025 రాత్రి, సాగర్ స్టూడియోలోని ఒక గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమలో విఫలమై మనస్తాపం ఈ నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. డాన్స్ అకాడమీ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి