Venkatesh: నాయుడుగారి కుటుంబం.. వైరల్ అవుతున్న దగ్గుబాటి ఫ్యామిలీ ఫోటో

తేజ దర్శకత్వంలో హీరోగా పరిచయం అయ్యాడు దగ్గుబాటి అభిరాం. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన అహింస అనే సినిమాలో నటించాడు అభిరాం. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడులైంది. కానీ ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇటీవలే అభిరాం ప్రత్యూషని  వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం శ్రీలంకలో అంగరంగవైభవంగా జరిగింది.

Venkatesh: నాయుడుగారి కుటుంబం.. వైరల్ అవుతున్న దగ్గుబాటి ఫ్యామిలీ ఫోటో
Daggubati Family

Updated on: Dec 13, 2023 | 9:43 AM

ఇటీవలే దగ్గుబాటి ఫ్యామిలీ లో పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. హీరో రానా తమ్ముడు అభిరామ్ వివాహం ఇటీవల శ్రీలంకలో జరిగింది. దగ్గుబాటి అభిరాం ఇటీవలే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తేజ దర్శకత్వంలో హీరోగా పరిచయం అయ్యాడు దగ్గుబాటి అభిరాం. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన అహింస అనే సినిమాలో నటించాడు అభిరాం. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడులైంది. కానీ ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇటీవలే అభిరాం ప్రత్యూషని  వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం శ్రీలంకలో అంగరంగవైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకి రెండు కుటుంబాల బంధువులు, స్నేహితులు హాజరయి సందడి చేసారు.

కొంతమంది అతిథులు, కుటుంబ సభ్యుల మధ్య వీరి వివాహం జరిగింది. ఇక ఈ వివాహవేడుకలో దగ్గుబాటి ఫ్యామిలీ అంతా కలిసి దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫొటోలో వెంకటేష్ ఆయన భార్య ఇద్దరు కూతుర్లు కనిపించారు. అలాగే సురేష్ బాబు ఆయన సతీమణి, రానా ఆయన భార్య కనిపించారు. అలాగే హీరో నాగ చైతన్య కూడా కనిపించాడు.

దగ్గుబాటి హీరోలందరూ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. వెంకటేష్ హీరోగా నటించిన సైందవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు శైలేష్ దర్శకత్వం వహించాడు. రానా కూడా తన సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరో వైపు నాగ చైతన్య తండేల్ అనే సినిమాతో రానున్నాడు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.

వెంకటేష్ ట్విట్టర్ పోస్ట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..