Yadam Raju: కమెడియన్ యాదమ్మ రాజు అరెస్ట్.. స్టేషన్‌కు పట్టుకెళ్లిన పోలీసులు..

|

Apr 04, 2024 | 11:24 AM

ఆహాలో నిర్వహిస్తున్న చెఫ్ మంత్రలో కూడా కనిపిస్తూ తన జోకులతో నవ్విస్తున్నాడు యాదమ రాజు. ఇదిలా ఉంటే తాజాగా యాదమ రాజును పోలీసులు అరెస్ట్ చేశారని వార్తలు వచ్చాయి. యాదమ రాజును పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు పంపించారని వార్తలు చక్కర్లు కొట్టాయి.

Yadam Raju: కమెడియన్ యాదమ్మ రాజు అరెస్ట్.. స్టేషన్‌కు పట్టుకెళ్లిన పోలీసులు..
Yadamma Raju
Follow us on

ప్రముఖ టీవీ షో పటాస్ ద్వారా కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యాదమ్మ రాజు. ఈ షో ద్వారా కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం వివిధ టీవీ షోల్లో పటిస్పీట్ చేస్తున్నారు. ఆహాలో నిర్వహిస్తున్న చెఫ్ మంత్రలో కూడా కనిపిస్తూ తన జోకులతో నవ్విస్తున్నాడు యాదమ్మ రాజు. ఇదిలా ఉంటే తాజాగా యాదమ్మ రాజును పోలీసులు అరెస్ట్ చేశారని వార్తలు వచ్చాయి. యాదమ్మ రాజును పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు పంపించారని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే యాదమ్మ రాజును పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు. అసలు అతను చేసిన తప్పేంటి.? అని అంతా గుసగుసలాడుకుంటున్నారు.

యాదమ్మ రాజు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు. ఓ యూట్యూబ్ ఛానెల్ పెట్టి రకరకాల వీడియోలు షేర్ చేస్తుంటాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ వీడియోను వదిలాడు యాదమ్మ రాజు. ఆ వీడియోలో ఓ కేసులో తనను పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పాడు. దాంతో అందరూ షాక్ అయ్యారు.  ‘‘ నన్ను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు పట్టుకొనిపోయారు. ఏప్రిల్ 1న ఒక సంఘటన జరగడంతో వల్ల నన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్నటి నుంచి దానికి సంబందించిన వార్తలు వచ్చాయి. నన్ను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో.? అసలు ఏం జరిగిందో..తెలియాలంటే కింద లింక్ క్లిక్ చేస్తే అర్థం అవుతుంది’’ అని చెప్పుకొచ్చాడు.

అయితే అదంతా నిజం కాదని.. ఓ వెబ్ సిరీస్ ప్రమోషన్‌ కోసం అలా వెరైటీగా చేసినట్లు తెలుస్తోంది. who is my daddy’ అనే వెబ్ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వెబ్‌సిరీస్‌లో యాదమ్మ రాజు కూడా నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన ట్రైలర్ కూడా ఇటీవలే విడుదలైంది. ఈ వెబ్ సిరీస్ కోసం యాదమ్మ రాజు ప్రమోషన్స్ మొదలు పెట్టాడు. ఈ వీడియో చూసిన కొందరు  తిడుతుంటే.. మరికొందరు మాత్రం ఏప్రిల్ ఫుల్ చేశాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.