AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Padmanabham : పద్మనాభం నా పెదనాన్న.. తెలిసినవాళ్లే మోసం చేయడంతో ఉన్న ఇల్లు కూడా అమ్మేశారు.. జబర్దస్త్ నటుడు..

తెలుగు సినిమా ప్రపంచంలో వందలాది చిత్రాల్లో నటించి తమదైన ముద్ర వేసిన నటీనటులు చాలా మంది ఉన్నారు. కానీ ఒక్కో సినిమాకు లక్షల్లో పారితోషికం తీసుకున్న గోప్ప నటులు.. చివరి రోజులలో మాత్రం ఎన్నో కష్టాలు పడ్డారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యారు. అందులో ప్రముఖ హాస్యనటుడు పద్మనాభం ఒకరు.

Padmanabham : పద్మనాభం నా పెదనాన్న.. తెలిసినవాళ్లే మోసం చేయడంతో ఉన్న ఇల్లు కూడా అమ్మేశారు.. జబర్దస్త్ నటుడు..
Actor Padmanabha Rao
Rajitha Chanti
|

Updated on: Jul 11, 2026 | 4:32 PM

Share

తెలుగు సినిమా రంగంలో హాస్య నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తనదైన ముద్ర వేసిన నటులలో పద్మనాభం ఒకరు. దాదాపు ఆరు దశాబ్దాల సుధీర్ఘ సినీ ప్రయాణంలో 400 కంటే ఎక్కువ చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆయన కామెడీ టైమింగ్, యాక్టింగ్ చూసి ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేసేవారు. ఒకప్పుడు అగ్ర నటుడిగా పేరు సంపాదించుకుని.. అత్యధిక పారితోషికం తీసుకున్న ఆయన.. చివరి రోజుల్లో మాత్రం నమ్మినవారే మోసం చేయడంతో ఆర్థిక సవాళ్లు ఎదుర్కోన్నారు. ఆయన తనయుడు ప్రస్తుతం సినిమాల్లో నటుడిగా కొనసాగుతున్నారు. అలాగే జబర్దస్త్ షోలోనూ తన నటనతో అలరించాడు. అతడు మరెవరో కాదు.. హాస్యనటుడు తిరుపతి ప్రకాష్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. తన సినీ కెరీర్‌లో ఎదుర్కొన్న కష్టాలను, పాత్రల కొరతను వివరించారు. సీనియర్ నటుడు పద్మనాభం తన పెద్దనాన్న అని వెల్లడించిన ఆయన, పద్మనాభం చివరి రోజుల్లో ఆర్థికంగా ఎదుర్కొన్న ఇబ్బందులను కూడా పంచుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి :Tollywood : పెదరాయుడు సినిమా చిన్నోడు గుర్తున్నాడా.. ? ఇప్పుడు తెలుగులో క్రేజీ హీరో.. ఫోటోస్ చూశారా..

తిరుపతి మాట్లాడుతూ.. సీరియల్స్‌లో తండ్రి పాత్రలకు పరిమితం కావడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. “స్టార్ మాలో పల్లకిలో పెళ్లికూతురు సీరియల్‌లో ఫాదర్ క్యారెక్టర్ చేశా. కెమెరా, లైటింగ్, ప్రొడక్షన్ అన్నీ ఒకేలా ఉంటాయి. టీవీలో తండ్రి పాత్రను ఎంతో మంది ఆమోదించినప్పుడు, సినిమాలో నాకు తండ్రి వేషాలు ఇవ్వరు, స్నేహితుడి వేషాలు ఇవ్వరు, చిన్న క్యారెక్టర్లు కూడా ఇవ్వరు” అని తిరుపతి ప్రకాష్ అన్నారు. తాను గతంలో 24 గంటలలో 16 గంటలు మేకప్‌లో ఉండి, నెలలో 30-40 రోజులు షూటింగ్‌లలో పాల్గొన్నానని, డే అండ్ నైట్ షూటింగ్‌లు కూడా చేశానని ఆయన గుర్తు చేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Bigg Boss : బిగ్ బాస్‌లోకి యంగ్ హీరో భార్య.. వారానికి లక్షలకుపైనే రెమ్యునరేషన్.. ఫాలోయింగ్ మాములుగా లేదుగా..

సీనియర్ నటుడు పద్మనాభంతో తనకున్న కుటుంబ అనుబంధాన్ని తిరుపతి ప్రకాష్ వెల్లడించారు. పద్మనాభం తన పెద్దనాన్న వరస అవుతారని, ఆయన స్వగ్రామం కడప సమీపంలో ఉందని తెలిపారు. పద్మనాభం తన చిన్నతనంలోనే తన ఫోటోలు చూసేవారని, వారి ఇంట్లోని వేడుకలకు వచ్చేవారని గుర్తు చేసుకున్నారు. పద్మనాభంతో కలిసి కృష్ణారెడ్డి సినిమాలో నటించానని, అందులో శ్రీకాంత్, జె.డి. చక్రవర్తి హీరోలని తెలిపారు. పద్మనాభం చివరి రోజుల్లో ఆర్థికంగా ఎదుర్కొన్న కష్టాలను ప్రకాష్ వివరించారు. “పద్మనాభం డిస్ట్రిబ్యూషన్స్‌లో చాలా లాస్ అయ్యారని విన్నాను. గుంతకల్‌లోని బసవరాజా డిస్ట్రిబ్యూషన్స్ ఆయనకు పెద్ద నష్టాన్ని మిగిల్చింది. తెలిసినవాళ్లే ఆయనను మోసం చేశారని విన్నాను” అని ప్రకాష్ అన్నారు. పాపం, లాస్ట్ లాస్ట్‌లో ఆయన చాలా ఇబ్బంది పడ్డారని, చనిపోయే సమయానికి బిలో మిడిల్ క్లాస్ స్థితికి చేరుకున్నారని తెలిపారు. చెన్నైలోని ఇంటిని కూడా ఆయన పిల్లలు అమ్మేశారని ప్రకాష్ పేర్కొన్నారు. ప్రస్తుతం పద్మనాభం పిల్లలతో తనకు కాంటాక్ట్ లేదని ఆయన స్పష్టం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Trending Song: అప్పట్లో ఈ సాంగ్ ట్రెండ్ సెట్టర్.. 90’s కుర్రాళ్ల మతులు పోగొట్టిన పాట.. ఇప్పటికీ క్రేజ్ మామూలుగా లేదుగా.

నటుడు తిరుపతి ప్రకాష్ ఇన్ స్టా పోస్ట్..

ఎక్కువ మంది చదివినవి : Cinema : ఒక గది.. ఐదుగురు మనుషులు.. ప్రతి సీన్ వణుకుపుట్టిస్తుంది.. ఓటీటీని షేక్ చేస్తున్న మైండ్ బ్లోయింగ్ మూవీ..

Follow Us