Comedian Sudhakar: కమెడియన్ సుధాకర్ తనయుడు బెన్ని టాలీవుడ్ లో ఎంట్రీ.. చిరంజీవిని కలిశా… అయితే..!

|

Mar 25, 2021 | 1:15 PM

ఒకప్పుడు తెలుగు, తమిళ ఇండస్ట్రీని ఏలిన నటుడు సుధాకర్. దాదాపు 600 చిత్రాలలకు పైగా నటించిన ప్రముఖ హాస్య నటుడు సుధాకర్ అనారోగ్యం బారినపడి ఇటీవలే కోలుకున్నారు.ఇటీవల బ్రెయిన్ స్టోక్..

Comedian Sudhakar: కమెడియన్ సుధాకర్ తనయుడు  బెన్ని టాలీవుడ్ లో ఎంట్రీ.. చిరంజీవిని కలిశా... అయితే..!
Sudhakar Son Benny
Follow us on

Comedian Sudhakar: ఒకప్పుడు తెలుగు, తమిళ ఇండస్ట్రీని ఏలిన నటుడు సుధాకర్. దాదాపు 600 చిత్రాలలకు పైగా నటించిన ప్రముఖ హాస్య నటుడు సుధాకర్ అనారోగ్యం బారినపడి ఇటీవలే కోలుకున్నారు.ఇటీవల బ్రెయిన్ స్టోక్ రావడంతో సుమారు 40 రోజులు కోమాలోనే ఉండి.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అయితే ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆర్ధిక స్థితితో పాటు పలు ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నారు. తాను బాగానే సంపాదించుకున్నానని .. ఒకరి ఇచ్చే పొజీషన్‌లో లేను.. అలాగే అప్పు తీసుకునే స్థితిలో కూడా లేనని చెప్పారు.. ప్రస్తుతం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగానే సాగుతుందని చెప్పారు సుధాకర్. అంతేకాదు తన కొడుకు బెనిడిక్ మైఖేల్ (బెన్నీ) టాలీవుడ్ అరంగేట్రంపై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది.. నడిచేటప్పుడు స్పీడ్‌గా నడవలేకపోతున్నా.. అదొక్కటే సమస్యఅని చెప్పారు.

సంక్రాంతి సినిమా తరువాత చాలా అనారోగ్యానికి గురికావడంతో మళ్లీ సినిమాలు చేయలేదు. కోమాలో 40 రోజులు పైగానే ఉన్నా.. బ్రెయిన్ స్టోక్ వచ్చింది. ఆ టైంలో జగపతిబాబు నన్ను చూడ్డానికి వచ్చారు.. చిరంజీవి, కోటి ఇలా చాలామంది వచ్చి చూసి వెళ్లారు. బయటకు వచ్చిన తరువాత నా కొడుకు చదువు నిమిత్తం కాలేజ్ సీటు కోసం చిరంజీవిని కలిశా. ఆ తరవాత మళ్లీ కలిసింది లేదని చెప్పారు.

పవన్ కళ్యాణ్ గారితో కూడా మంచి పరిచయం ఉందని తనను అన్నయ్య అనేవారని చెప్పారు సుధాకర్. ఇక సినిమాల్లో నటించినా ఎప్పుడు పర్సనల్ గా కలవలేదని అన్నారు. ఇక బెన్ని సినిమాల్లోకి రావాలని చాలా ఉత్సాహంగా ఉన్నాడు. నటన అనేది తన బ్లడ్‌లోనే ఉందని అంటున్నాడు. నిజానికి వాడు సినిమాల్లోకి వస్తాడని అనుకోలేదు. ఈ మధ్యనే నాకు ఆ విషయం చెప్పాడు. ఒక ప్రాజెక్ట్ రెడీ అయ్యింది. వర్క్ షాప్ నడుస్తుంది. స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. కొత్త దర్శకుడు నరేష్ నన్ను అప్రోజ్ అయ్యారని తెలిపాడు సుధాకర్ తనయుడు బెన్ని.. అంతేకాదు తనకు హీరోగా ఏమి చేయలని లేదని.. నాన్నలా ఏ పాత్రలోనైనా నటిస్తానంటున్నాడు. ఇక మెగాస్టార్ చిరంజీవిని చదువు నిమిత్తం కలిసినట్లు చెప్పాడు బెన్ని

అయితే ప్రముఖ నటుడు చిరంజీవి, హరిప్రసాద్ మరియు నారాయణరావులతో కలసి సుధాకర్ ఒకే గదిలో ఉండేవారు. అప్పటికి దర్శకుడు భారతీరాజా సహాయ దర్శకుడిగా పనిచేస్తున్నరు. ఆయన్ని కలిసిన సుధాకర్ ను హీరోగా సిఫార్స్ చేయగా సుధాకర్, రాధికలను పరిచయం చేస్తూ హీరో, హీరోయిన్ గా కిళుక్కెమ్ పోంగెమ్ రెయిల్ సినిమా రూపొందించారు. ఆ సినిమా హిట్ అయింది. దీంతో తమిళంలో పలు విజయవంతమైన సినిమాల్లో నటించి పెద్ద నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. కొన్ని అనుకోని కారణాలతో తమిళ పరిశ్రమ నుంచి తెలుగు సినీ పరిశ్రమకి వచ్చిన సుధాకర్ ఇక్కడ సహాయ నటుడిగా..హాస్య నటుడుగా స్థిరపడాల్సి వచ్చింది. తెలుగులో సృష్టి రహస్యాలు సినిమాతో అడుగుపెట్టగా చిరంజీవికి తమ్ముడిగా ఊరికిచ్చిన మాట, కృష్ణకు తమ్ముడిగా భోగి మటలు సినిమాలు సుధాకర్ కి మంచి పేరును తీసుకొచ్చాయి. పలు చిత్రాల్లో విలన్ గా, హాస్య నటుడుగా, సహాయ నటుడు గా నటించిన సుధాకర్ నిర్మాత గా మారి మూడు సినిమలను కూడా నిర్మించారు. అందులో ఒకటి ఒకప్పటి సుధాకర్ రూమేట్, ప్రెండ్ అయిన నారాయణరావు తో కలిసి మరో ఫ్రెండ్, రూమేట్ అయిన మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన యముడికి మెగుడు సినిమా..

Also Read: ’74 ఏళ్లుగా ప్రభుత్వం ఉందన్న భ్రమలో బతుకున్నాం’ అంటోన్న మెగా హీరో.. ఆసక్తిగా రిపబ్లిక్‌..

నిద్రలో పాములు కలలోకి వస్తున్నాయా..? వాటి ఫలితాలు ఏమిటో తెలుసా…?