Ticket Booking: త్వరలో ఆన్‌లైన్ టిక్కెటింగ్ వెబ్‌సైట్.. కీలక వివరాలు వెల్లడించిన మంత్రి పేర్ని నాని..

ఆన్ లైన్ టిక్కెటింగ్ కోసం అవసరమైన వెబ్ సైట్ రూపకల్పనపై అధికారులతో సినిమాటోగ్రఫి మంత్రి పేర్ని నాని సమావేశం అయ్యారు. వీలైనంత త్వరలో..

Ticket Booking: త్వరలో ఆన్‌లైన్ టిక్కెటింగ్ వెబ్‌సైట్.. కీలక వివరాలు వెల్లడించిన మంత్రి పేర్ని నాని..
Perni Nani Ap Movie Theater

Edited By: Ravi Kiran

Updated on: Jan 10, 2022 | 7:50 PM

సినిమా టికెట్లపై ఫోకస్ పెట్టింది ఏపీ సర్కార్. సినిమా థియేటర్లల్లో ఆన్‌లైన్ టిక్కెటింగ్ వ్యవస్థ ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ఆన్ లైన్ టిక్కెటింగ్ కోసం అవసరమైన వెబ్ సైట్ రూపకల్పనపై అధికారులతో సినిమాటోగ్రఫి మంత్రి పేర్ని నాని సమావేశం అయ్యారు. వీలైనంత త్వరలో ఏపీలోని సినీ థియేటర్లల్లో ఆన్ లైన్ టిక్కెటింగ్ వ్యవస్థను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పటికే టిక్కెట్ రేట్లను నియంత్రిస్తూ చర్యలు తీసుకున్న ప్రభుత్వం.. తాజాగా ఆన్ లైన్ టిక్కెటింగ్ వ్యవస్థ పైనా ఫోకస్ పెట్టింది. సింగిల్ థియేటర్లు, మల్టీప్లెక్స్ థియేటర్స్ లో ఆన్ లైన్ బుకింగ్ పేరుతో మధ్యవర్తులు భారీ మొత్తాలను నొప్పి తెలియకుండా వసూల్ చేసేస్తున్నదోపిడీకి అడ్డుకత్తర పెట్టిన సంగతి తెలిసిందే.

గతంలో టిక్కెట్‌కు పది రూపాయల నుండి ఇరవై రూపాయల వరకూ అదనంగా సర్వీస్ ఛార్జీల పేరుతో దోపిడీ ఉండేది. అలాంటి వాటికి చెక్ చెబుతూ, ఆన్ లైన్ బుకింగ్ విషయంలో యూనిఫామిటీ తీసుకువచ్చింది. ఆన్ లైన్ బుకింగ్ వ్యవస్థను ప్రారంభించబోతున్నట్టు ఏపీ ప్రభుత్వం. అంతేకాదు… గతంలో జీవోనూ కూడా జారీ చేసింది.

రామ్ గోపాల్ వర్మ తో భేటీ అనంతరం..

ఇదిలావుంటే.. రామ్ గోపాల్ వర్మతో భేటీ అనంతరం సినిమాటోగ్రఫి మంత్రి పేర్ని నాని ఆసక్తికర కామెంట్స్ చేశారు. 1958 సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారమే సినిమా టికెట్ ధరలు ఉన్నాయని.. రాం గోపాల్ వర్మ తాను చెప్పాల్సింది చెప్పారని అన్నారు. అన్నీ వివరంగా విన్నానని.. ప్రభుత్వ నిర్ణయాలు చట్ట ప్రకారమే జరుగుతున్నాయని వెల్లడించారు. ఇప్పటికే సినిమా టికెట్ అంశానికి సంబంధించి ఒక కమిటీ ఏర్పాటు అయిందని.. ఆ కమిటీ సూచనల ప్రకారం తదుపరి నిర్ణయాలు ఉంటాయని తెలిపారు .

ఇవి కూడా చదవండి: Punjab Assembly Election 2022: వీటి చుట్టే తిరుగుతున్న పంజాబ్ ఎన్నికలు.. ఆశలన్నీ కింగ్ మేకర్‌పైనే..

Flamingos: ఫ్లెమింగోలు ఒంటికాలి జపం ఎందుకు చేస్తాయో తెలుసా.. దీని వెనుక ఓ సైన్స్..