PC Sreeram: అందుకే మళ్లీ మెగాఫోన్ పట్టలేదు.. సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ ఆసక్తికర కామెంట్స్
థాంక్యూ కథలో మానవీయ విలువల చుట్టూ అల్లుకున్న బావోద్వేగాలు నన్ను ప్రభావితం చేశాయి. అందుకే ఇందులో భాగం కావలనున్నాను. మనసు నుంచి థాంక్యూ అనే మాట వస్తే మన చుట్టూ ఉండే

డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటించిన లేటేస్ట్ చిత్రం థాంక్యూ. రాశీఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఈరోజు (జూలై 22న) విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ నిర్మించారు. అలాగే ఈ చిత్రానికి ఛాయాగ్రహకుడిగా వ్యవహరించారు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ (PC Sreeram). ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దర్శకత్వం వేరు. కెమెరా వేరు.. అన్ని విభాగాలను నేను హ్యాండిల్ చేయలేకపోయాను. అందుకే మళ్లీ మెగాఫోన్ పట్టలేదని అన్నారు.
పీసీ శ్రీరామ్ మాట్లాడుతూ.. ” థాంక్యూ కథలో మానవీయ విలువల చుట్టూ అల్లుకున్న బావోద్వేగాలు నన్ను ప్రభావితం చేశాయి. అందుకే ఇందులో భాగం కావలనున్నాను. మనసు నుంచి థాంక్యూ అనే మాట వస్తే మన చుట్టూ ఉండే వాతావరణం పాజిటివ్‌గా మారుతుందని చెప్పే ప్రయత్నమే ఈ సినిమా. నాగచైతన్యను చూసిన తర్వాత నటన గురించి మాట్లాడాలనిపిస్తుంది. మూడు పదుల వయసు దాటిన వ్యక్తిగా నటించి మెప్పించాడు. ప్రేక్షకులకు దర్శకులు ఏం చెప్పాలనుకుంటున్నారనేది నాకు తెలిస్తేనే నా పని ఆ సినిమాకు న్యాయం చేయగలుగుతుంది. . ఓ సీన్, ఓ కథతో ఏం చేప్పాలనుకుంటున్నారనేది తెలియాలి. నేనెప్పుడు వాళ్ల మేధాశక్తిని ప్రశ్నించను. సాంకేతికత ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుటంది. కొత్త వచ్చిన వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. సినిమాకో కలర్ ప్యాలెట్ మార్చాలని అనుకోను. ఎందుకంటే భారతీయ సినిమాకి ఒకే కలర్ ఉంటుంది. ఇక ఇవే కాకుండా డెరెక్షన్ వేరు.. కెమెరా వేరు.. ఈ రెండింటితోపాటు అన్ని విభాగాలను హ్యండిల్ చేయాలేకపోయాను. అందుకే ఎప్పుడూ మెగాఫోన్ పట్టలేదు” అంటూ చెప్పుకొచ్చారు.




