
ప్రముఖ కొరియోగ్రాఫర్ శంకర్ మాస్టర్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించాడు. అలాగే మహేష్ బాబు వారణాసి చిత్రంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు. జక్కన్న ఓ విజనరీ డైరెక్టర్ అని పేర్కొన్న అతడు.. తన సినిమాలపై ఎంతో శ్రద్ధ చూపిస్తారని.. అందుకే ఆయన చిత్రాలు ఇండస్ట్రీలో ప్రత్యేకంగా నిలుస్తాయని అన్నాడు.బాహుబలి చిత్రం షూటింగ్ సమయంలో అనుకోని సంఘటన ఒకటి జరిగిందని అన్నాడు. ఆ చిత్ర షూటింగ్‌లో ఓ సీన్ చేసేటప్పుడు ఒక బ్లాస్ట్ కారణంగా ఫైటర్ వెనుకభాగం కాలిపోయింది. అప్పుడు రాజమౌళి భార్య అతడ్ని తల్లిలా చూసుకున్నారు.
యూనిట్‌లో ఎవరికి చిన్న గాయమైనా, స్వయంగా రాజమౌళి భార్య వెళ్లి చూసుకునేవారు, సిబ్బంది సురక్షితంగా ఉండేలా బాధ్యత తీసుకునేవారని వివరించాడు. రాజమౌళి సినిమాకు ఆయన కుటుంబమే పెద్ద ఆస్తి అని కొరియోగ్రాఫర్ శంకర్ అన్నాడు.ఆమీర్ ఖాన్, కమల్ హాసన్‌ల మాదిరిగానే రాజమౌళి కూడా ఒక పర్ఫెక్షనిస్ట్ అని.. కోపం వచ్చినప్పుడు ఎవరినీ నిందించకుండా ఫోన్‌లు లేదా మైక్‌లు పగులగొడతారని.. ఇలా ఆయన తన కోపాన్ని వ్యక్తపరుస్తారని శంకర్ చెప్పాడు. కాగా, మహేష్ బాబు వారణాసి చిత్రం వేరే లెవల్‌లో ఉంటుందని శంకర్ చెప్పుకొచ్చాడు.ఈ సినిమా మొదటి భాగం నెరేషన్ మూడు గంటల పాటు విన్నప్పుడు, తాను సినిమాను పూర్తిగా చూసేసినంత అనుభూతిని పొందానని, “మైండ్ బ్లోయింగ్”గా అనిపించిందని చెప్పాడు. రాజమౌళి వర్క్‌హాలిక్ అని, ఆయనకు సినిమా అంటే ప్రాణం అని, తాను 43 సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో ఉన్నా, ఇప్పటికీ రాజమౌళి నుంచి కొత్త విషయాలు నేర్చుకుంటున్నానని శంకర్ మాస్టర్ అన్నాడు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..