AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vikram: ఊరమాస్ లుక్ మావ..! వీర ధీర శూరన్‌గా చియాన్ విక్రమ్.. అదిరిపోయిన టీజర్

స్టార్ హీరో చియాన్ విక్రమ్ తమిళ్ తో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. విక్రమ్ సినిమాలు తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇటీవలే పొన్నియన్ సెల్వన్ సినిమాతో ఆకట్టుకున్న విక్రమ్ ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు

Vikram: ఊరమాస్ లుక్ మావ..! వీర ధీర శూరన్‌గా చియాన్ విక్రమ్.. అదిరిపోయిన టీజర్
Vikram
Rajeev Rayala
|

Updated on: Dec 09, 2024 | 6:45 PM

Share

టాలెంటెడ్ యాక్టర్, స్టార్ హీరో చియాన్ విక్రమ్ ‘వీర ధీర శూరన్ పార్ట్ 2’ భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ఎస్ యు అరుణ్‌కుమార్ దర్శకత్వం వహించారు. ఆర్ఆర్ఆర్,విక్రమ్‌ చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసి, ముబైకార్, థగ్స్, మురా వంటి చిత్రాలను హెచ్ఆర్ పిక్చర్స్ బ్యానర్ మీద రియా శిబు నిర్మించి మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం ఈయన నిర్మాతగా ‘వీర ధీర శూరన్ పార్ట్ 2’ రాబోతోంది. ఈ క్రమంలో తాజాగా టీజర్‌ను విడుదల చేశారు.

ఇది కూడా చదవండి : Tollywood : 14ఏళ్లకే ఎంట్రీ ఇచ్చింది.. ఇప్పుడు మూడు నిమిషాల పాటకు రూ. 2కోట్లు అందుకుంటుంది..

కిరాణ కొట్టులో హీరో ఉండటం.. సరుకుల కోసం మహిళ రావడం.. తన కూతురికి డిస్టర్బ్ అవుతుంది మెల్లిగా అడుగు అంటూ హీరో అనడం.. జాలీగా తన ఫ్యామిలీతో కలిసి తిరుగుతున్న హీరో ఆ తరువాత వెంటనే గన్‌తో విధ్వంసం సృష్టించడం.. అలా విక్రమ్ పాత్రలోని రెండు కోణాల్ని టీజర్‌లో చూపించాడు. ఇక పోలీస్ ఆఫీసర్‌గా ఎస్ జే సూర్య ఈ చిత్రంలో చాలా కొత్తగా కనిపించబోతోన్నారు. ఈ టీజర్‌లో ఈ సినిమాలో విక్రమ్, ఎస్ జే సూర్య, సూరజ్ వెంజరమూడు, దుషార విజయన్‌లు బాగా హైలెట్ అయ్యారు.

ఇది కూడా చదవండి :మహేష్ బాబుతో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ళ హాట్ ఫేవరేట్.. చూస్తే ప్రేమలోపడిపోవాల్సిందే

ఇప్పటికే ‘వీర ధీర శూరన్ పార్ట్ 2’ చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం చిత్ర బృందం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉంది. ఈ మూవీ నుంచి ఇది వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్ యూట్యూబ్‌లో ఇప్పటికే 14 మిలియన్ల వ్యూస్‌ను కొల్లగొట్టి అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా రిలీజ్ చేసిన టీజర్‌లో చియాన్ విక్రమ్ నటన, యాక్షన్ సీక్వెన్సులు, విజువల్స్, ఆర్ఆర్ వర్క్ ఇలా అన్నీ కూడా అభిమానుల అంచనాలను మించిపోయాయి. ఇక ఇందులో చియాన్ విక్రమ్ డిఫరెంట్ లుక్స్, ఎస్ జే సూర్య పర్ఫామెన్స్, పాత్రలకు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కేలా ఉంది. ఈ టీజర్‌తో సినిమా మీద అంచనాలు రెట్టింపు అయ్యాయి. తేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీ, జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం, జి.కె.ప్రసన్న ఎడిటింగ్, సి.ఎస్.బాలచందర్ ఆర్ట్ డైరెక్షన్‌ బాధ్యతల్ని నిర్వర్తించారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలోన తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ కానుంది.

ఇది కూడా చదవండి :కోతి కొమ్మచ్చి ఆడుతున్న ఈ కుర్రాళ్లలో ఓ స్టార్ హీరో ఉన్నాడు.. అమ్మాయిలు వెర్రెక్కిపోతారు అతనంటే.. 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..