దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావాడి మొదలైంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాలు విడుదలవుతున్నాయి. సౌత్ ఇండియాలో సినీ ప్రముఖులు ఈసారి లోక్సభ ఎన్నికల్లో పోటీచేసేందుకు రెడీ అయ్యారు. సీనియర్ నటి రాధిక శరత్ కుమార్, బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఈసారి ఎలక్షన్లలో నిలబడనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు మరో హీరోయిన్ పేరు వినిపిస్తుంది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో బాలీవుడ్ హీరోయిన్.. మోడల్ నేహా శర్మ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ఆమె తండ్రి కాంగ్రెస్ నాయకుడు అజయ్ శర్మ తెలిపారు. బిహార్ లోని భాగల్ పూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు నేహాశర్మ తండ్రి. అయితే మహాఘట్ బంధన్ సీట్ల పంపకంపై చర్చల తర్వాత తమ పార్టీ ఈ స్థానం నుంచి పోటీ చేస్తే తన కూతురికి టికెట్ వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఈ విషయాన్ని మీడియా సమావేశంలో వెల్లడించారు.
“కాంగ్రెస్ కు భాగల్ పూర్ నియోజకవర్గం కావాలి. ఎందుకంటే అది మా పార్టీకి కంచుకోట. ఇప్పుడు సీట్ల పంపకాలపై ఏర్పాటు చర్చలు జరుగుతున్నాయి. ఒకవేల మా పార్టీకి అవకాశం వస్తే ఎవరు పోటీ చేయాలనేది పార్టీ హైకమాండ్ పై ఆధారపడి ఉంటుంది. పార్టీ నన్ను పోటీ చేయాలని అడిగితే కచ్చితంగా పోటీ చేస్తాను.. లేదా నా కుమార్తే నేహా శర్మ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయవచ్చు.. అన్ని విషయాలకు వెయిట్ చేయాల్సిందే” అని అన్నారు అజయ్ శర్మ. బిహార్ లో మొత్తం 40 లోక్సభ స్థానాలున్నాయి. ఇప్పటికే ఎన్టీయే మిత్రపక్షాల మధ్య సీట్ల పంపకాలు పూర్తికాగా. ఇండియా కూటమి చర్చలు జరుపుతుంది. త్వరలోనే దీనిపై ప్రకటన రానుందని ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ వెల్లడించారు.
ముంబైలో జరిగిన ఆప్ ఇండియా బ్లాక్ ర్యాలీకి హాజరైన తర్వాత మార్చి 18న పాట్కాకు తిరిగి వచ్చారు యావద్. ఆమహాగత్బంధన్ మిత్రపక్షాల మధ్య సీట్ల పంపకం మరికొన్ని రోజుల్లో నిర్ణయించబడుతుందని అన్నారు. నేహా శర్మ కథానాయికగా సినీ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా పరిచయమైన చిరుత సినిమాలో నేహా శర్మ కథానాయికగా నటించింది. ఈ మూవీ తర్వాత కుర్రాడు సినిమాలో కనిపించింది. ఆ తర్వాత ఆమెకు తెలుగులో అవకాశాలు రాకపోవడంతో హిందీకి షిఫ్ట్ అయ్యింది. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.