మరోసారి చిరు, బాలయ్యల బాక్సాఫీస్ వార్ !

|

Sep 24, 2020 | 10:16 PM

చిరంజీవి వెర్సెస్‍ బాలకృష్ణ మధ్య వార్ మాములుగా ఉండదు. రియల్ లైఫులో కాదండీ, మేము మాట్లాడేది రీల్ లైఫ్  గురించి.

మరోసారి చిరు, బాలయ్యల బాక్సాఫీస్ వార్ !
Follow us on

చిరంజీవి వెర్సెస్‍ బాలకృష్ణ మధ్య వార్ మాములుగా ఉండదు. రియల్ లైఫులో కాదండీ, మేము మాట్లాడేది రీల్ లైఫ్  గురించి. ఈ ఇద్దరు సీనియర్  హీరోలు నువ్వా-నేనా అంటూ చాలాసార్లు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. 2017 లో కూడా సంక్రాంతికి ఖైదీ నంబర్‍ 150, గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలతో బరిలోకి దిగారు. అయితే రెండూ సినిమాలు విజయవంతమయ్యాయి. కాకపోతే రెండు సినిమాలవి విభిన్న నేపథ్యాలు. అయితే ఇద్దరివీ మాస్‍ సినిమాలయితే ఆ క్లాష్‍ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి రసవత్తర పోటీ మరోసారి జరిగే అవకాశం కనిపిస్తోంది.చిరంజీవి ‘ఆచార్య’ చిత్రాన్ని ఏప్రిల్‍ నెలాఖరులో రిలీజ్ చేయాలని కొరటాల అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారు. బోయపాటి శ్రీను కూడా బాలకృష్ణ చిత్రాన్ని ఏప్రిల్‍ 30కి రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. అది సింహా రిలీజ్‍ డేట్‍ కావడంతో సెంటిమెంట్‍ ప్రకారం కలిసి వస్తుందని ఆ డేట్‍ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

రెండు చిత్రాల చిత్రీకరణలు నవంబర్‍లోనే పున: ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దర్శకులు ప్లాన్ చేసుకున్నట్లు ఎలాంటి అవాంతరాలు లేకుండా షూటింగ్స్ పూర్తయితే మరోసారి ఈ సీనియర్ సూపర్‍స్టార్స్ మధ్య బాక్సాఫీస్‍ వార్ మరోసారి చూడొచ్చు.

Also Read :

శ్రీశైలంలోని ఘంటా మఠంలో మరో అద్భుతం

ఢిల్లీ డిప్యూటీ సీఎం ఆరోగ్య పరిస్థితి విషమం