Indra Re-Release: ఇప్పటికీ అదే వైబ్.. మీసం తిప్పుతూ ఇంద్ర డైలాగ్ చెప్పిన మెగాస్టార్

|

Aug 20, 2024 | 4:35 PM

తెలుగు ఇండస్ట్రీలో నయా రికార్డ్ క్రియేట్ చేసింది ఈ సినిమా. బీ గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. ఇప్పుడు రీ రిలీజ్ కానుంది. చిరంజీవి బర్త్ డే గిఫ్ట్ గా ఇంద్ర సినిమాను రీ రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా కోసం మెగాస్టార్ ఫ్యాన్స్ ఈగర్‌గా చూస్తున్నారు. ఈ సినిమా రీ రిలీజ్ టికెట్స్ కూడా భారీగా అమ్ముడయ్యాయి.

Indra Re-Release: ఇప్పటికీ అదే వైబ్.. మీసం తిప్పుతూ ఇంద్ర డైలాగ్ చెప్పిన మెగాస్టార్
Chiranjeevi
Follow us on

మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాల్లో సంచలన విజయం సాధించిన సినిమా ఇంద్ర . ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. తెలుగు ఇండస్ట్రీలో నయా రికార్డ్ క్రియేట్ చేసింది ఈ సినిమా. బీ గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. ఇప్పుడు రీ రిలీజ్ కానుంది. చిరంజీవి బర్త్ డే గిఫ్ట్ గా ఇంద్ర సినిమాను రీ రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా కోసం మెగాస్టార్ ఫ్యాన్స్ ఈగర్‌గా చూస్తున్నారు. ఈ సినిమా రీ రిలీజ్ టికెట్స్ కూడా భారీగా అమ్ముడయ్యాయి. ఇక ఇంద్ర సినిమాకు మణిశర్మ అందించిన సంగీతం సినిమాకే హైలైట్..

ఇంద్ర సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ హీరోయిన్స్ గా నటించారు. ఈ మూవీలో మెగాస్టార్ యాక్షన్ ప్రేక్షకులకు పిచ్చెక్కించింది. ఈ మూవీ డైలాగ్స్ చాలా పాపులర్ అయ్యాయి. ఫ్యాక్షనిజం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు బీ గోపాల్ దర్శకత్వం వహించారు. వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వనీదత్ ఇంద్ర సినిమాను నిర్మించారు. ఈ సినిమాతో 2002 సంవత్సరానికి ఉత్తమ నటుడిగా చిరంజీవి నంది పురస్కారం అందుకున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమా రీ రిలీజ్ కానుంది. చిరంజీవి బర్త్ డే గిఫ్ట్ గా ఆగస్టు 22న రీ రిలీజ్ చేయనున్నారు.

వీడియో చూడండి ..