
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల హంగామా నడుస్తుంది. హీరోల పుట్టిన రోజులకు, స్పెషల్ డేస్ కు సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. మహేష్ బాబు నటించిన పోకిరి సినిమా నుంచి ఈ ట్రెండ్ ఊపందుకుంది. ఇప్పటికే చాలా సినిమాలు రీ రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ ను సొంతం చేసుకున్నాయి. పోటీపడుతూ రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్‌ను రాబడుతున్నాయి ఓల్డ్ సినిమాలు. అప్పుడు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా రీ రిలీజ్ లో రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయినా మహేష్ బాబు బిజినెస్ మెన్, ప్రభాస్ యోగి సినిమా రీ రిలీజ్ అయ్యి విపరీతమైన రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక త్వరలోనే మరికొన్ని సినిమాలు కూడా రీ రిలీజ్ కానున్నాయి. ఇదిలా ఉంటే వాటితో పాటు మరికొన్ని సూపర్ హిట్ సినిమాలు కూడా రీ రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఆ సినిమాలు ఏవంటే..
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమా ఒకటి. హిందీలో వచ్చిన మున్నాభాయ్ ఎంబిబిఎస్ కు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమానా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో మెగాస్టార్ నటన, ఆయన కామెడీ టైమింగ్ ఆడియన్స్ ను ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి.
ఇక ఇప్పుడు ఈ సూపర్ హిట్ సినిమా మరోసారి థియేటర్స్ లో సందడి చేయనుంది. అయితే ఈ సినిమా మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అవుతుందా లేక ఆ తర్వాత రిలీజ్ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఈ సినిమా రీ రిలీజ్ అని తెలిసిన దగ్గర నుంచి మెగా ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ సినిమాతో పాటు నాగ చైతన్య, సమంత కలిసి నటించిన ఏ మాయ చేశావే సినిమాను రీ రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటికీ చాలా మందికి ఫెవరెట్ మూవీ. ఈ సినిమా రీ రిలీజ్ డేట్ ను కూడా త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. ఈ సినిమాలే కాదు ఈ ఏడాది చివరిలోగా 12 సినిమాలు రీ రిలీజ్ కానున్నాయని తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.