
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా మన శంకరవరప్రసాద్ గారు. క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి పండగ కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కనీవినీ ఎరుగని కలెక్షన్లు సాధిస్తూ బాక్సాఫీస్ దుమ్ము దులుపుతోంది. ఇప్పటికే ఈ మూవీ కలెక్షన్లు రూ. 350 కోట్లకు చేరువైనట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే మన శంకరవరప్రసాద్ గారు సినిమాకు భీమ్స్ స్వరాలు అందించారు. అందుకు తగ్గట్టుగానే ఈ మెగా మూవీలోని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. మీసాల పిల్ల, శశిరేఖ, హుక్ స్టెప్ సాంగ్స్ యూట్యూబ్ లో ఛార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఇక చిన్న పిల్లల వాయిస్ తో వచ్చే ‘ఫ్లై.. హై’ సాంగ్ అయితే సినిమాకు ఎమోషనల్ ఫీలింగ్ తీసుకొచ్చింది. ఇక ఈ సాంగ్ పాడింది మరెవరో కాదు మెగాస్టార్ మేనకోడలే. చిరంజీవి సోదరి మాధవి కుమార్తె అయిన నైరా ఈ పాటను ఎంతో లయబద్ధంగా ఆలపించి అందరి మన్ననలు అందుకుంటోంది.
ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి తన మేనకోడలి ట్యాలెంట్ ను చూసి మురిసిపోయారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా నైరాపై ప్రశంసలు కురిపించారు. ‘నా చిన్న మేనకోడలు నైరా ఫ్లై.. హై పాట పాడటం చూసి.. నా హృదయం ఆనందంతో నిండిపోయింది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. నీ మార్గంలో నువ్వు మరింత అంతులేని అవకాశాలతో ముందుకు సాగాలని కోరుకుంటున్నా. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశిస్తున్నాను’ అని చిరంజీవి ట్వీట్ లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
Watching my little niece #Naira sing the #FlyingHigh song from my film #ManaShankaraVaraPrasadGaru filled my heart with indescribable joy ❤️https://t.co/Ghbnf7gQtX
This is just the beginning, my dear. May your path always be bright, joyful, and filled with endless… pic.twitter.com/hxcaTwLiWw
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 21, 2026
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..