Vakeel Saab: వకీల్ సాబ్ పై ఆచార్య ప్రశంసలు .. తనదైన స్టైల్ లో పవన్ సినిమాకు రివ్యూ ఇచ్చిన మెగాస్టార్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేస్తుంది. ఈ సినిమా విడుదలైన మొదటిరోజే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పటికే బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న

Vakeel Saab: వకీల్ సాబ్ పై ఆచార్య ప్రశంసలు .. తనదైన స్టైల్ లో పవన్ సినిమాకు రివ్యూ ఇచ్చిన మెగాస్టార్
Megastar Chiranjeevi

Updated on: Apr 10, 2021 | 1:12 PM

Vakeel Saab: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేస్తుంది. ఈ సినిమా విడుదలైన మొదటిరోజే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పటికే బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ఈ సినిమా పై సర్వత్రా ప్రశంశల వెల్లువెత్తుతున్నాయి. దాదాపు మూడేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ ఇలా ఒక పవర్ ఫుల్ కథతో సినిమా చేయడంతో పవన్ అభిమానులంతా సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమా పై సినిమా పెద్దలు, సెలబ్రెటీలు తమ అభిప్రాయాలను, ప్రశంశలు కురిపిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి  వకీల్ సాబ్ సినిమాను కుటుంబ సమేతంగా ఈ సినిమా వీక్షించారు.

వకీల్ సాబ్ సినిమా పైన మెగాస్టార్ తనదైన స్టైల్ లో రివ్యూ ఇచ్చారు. ఈ మేరకు మెగాస్టార్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు. “మూడేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ లో అదే వేడి.. అదే వాడి.. అదే పవర్. ప్రకాష్ రాజ్ తో కోర్ట్ రూమ్ డ్రామా అద్భుతంగా ఉంది. నివేద థామస్, అంజలీ, అనన్య వారి పాత్రల్లో జీవించారు. సినిమాకు తమన్, డీఓపీ వినోద్ ప్రాణం పోశారు. అలాగే దిల్ రాజుకు, బోణి కపూర్ జీ కి, దర్శకుడు వేణు శ్రీరామ్ కు మిగతా టీమందరికి నా శుభాకాంక్షలు. అన్నింటింకి మించి మహిళలకు ఇవ్వాల్సిన గౌరవాన్ని తెలియజేసే ఒక అత్యవసరమైన చిత్రం ఇది. ఈ వకీల్ సాబ్ కేసులనే కాదు అందరి మనసులను గెలుస్తాడు. అంటూ ట్వీట్ చేశారు చిరంజీవి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Vakeel Saab Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’సినిమాను వీక్షిణించిన మెగా ఫ్యామిలీ..

Vakeel Saab: ‘వకీల్ సాబ్’ మళ్లీ షాక్.. టికెట్ ధరలపై మరోసారి హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం.!