Chiranjeevi: ‘అన్నయ్య మనసు బంగారం’..స్నేహితుడికి అండగా మెగాస్టార్‌ చిరంజీవి.. దగ్గరుండి మరీ ట్రీట్‌మెంట్‌

|

Oct 22, 2023 | 6:46 PM

సినిమాల సంగతి పక్కన పెడితే.. ఎవరైనా కష్టాల్లో ఉంటే సాయం చేసేందుకు మెగాస్టార్‌ చిరంజీవి చేయి ముందుంటుంది. బ్లడ్‌ బ్యాంక్‌, ఐ బ్యాంక్ అంటూ ఇప్పటికే ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిన చిరంజీవి కరోనా కాలంలో ఆక్సిజన్‌ బ్యాంకులు కూడా ఏర్పాటు చేశారు. అంతేకాదు ఆపదల్లో ఉన్న తోటి నటీనటులు, అభిమానులకు 'నేనున్నా' అంటూ ఆపన్న హస్తం అందించిన సందర్భాలు కోకొల్లలు.

Chiranjeevi: అన్నయ్య మనసు బంగారం..స్నేహితుడికి అండగా మెగాస్టార్‌ చిరంజీవి.. దగ్గరుండి మరీ ట్రీట్‌మెంట్‌
Megastar Chiranjeevi
Follow us on

చిరంజీవి.. సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా స్వయం కృషితో మెగాస్టార్‌గా ఎదిగిన హీరో. తన నటనతో కోట్లాది మంది అభిమానం చూరగొన్నారాయన. తన లాంటి నటీనటులకు స్ఫూర్తిగా కూడా నిలిచారు. సినిమాల సంగతి పక్కన పెడితే.. ఎవరైనా కష్టాల్లో ఉంటే సాయం చేసేందుకు మెగాస్టార్‌ చిరంజీవి చేయి ముందుంటుంది. బ్లడ్‌ బ్యాంక్‌, ఐ బ్యాంక్ అంటూ ఇప్పటికే ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిన చిరంజీవి కరోనా కాలంలో ఆక్సిజన్‌ బ్యాంకులు కూడా ఏర్పాటు చేశారు. అంతేకాదు ఆపదల్లో ఉన్న తోటి నటీనటులు, అభిమానులకు ‘నేనున్నా’ అంటూ ఆపన్న హస్తం అందించిన సందర్భాలు కోకొల్లలు. అయితే వీటిలో చాలావరకు బయటకు రావు. కానీ చిరంజీవి ఫ్యాన్స్‌ తమ అభిమాన హీరో చేసిన మంచి పనులను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటారు. అలా తాజాగా మెగాస్టార్‌ చేసిన మరో గొప్ప పని వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం 157వ సినిమా పనుల్లో బిజీబిజీగా ఉన్న చిరంజీవి ఇటీవల హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రిలో కనిపించారు. ఎవరో దంపతుల ఆరోగ్య సమాచారం గురించి అడిగి తెలుసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఈ ఫొటోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆస్పత్రిలో ఉన్నది మరెవరో కాదట.. చిరంజీవి చిన్ననాటి స్నేహితుల్లో ఒకరట. మొగల్తూరులో పుట్టి పెరిగిన మెగాస్టార్‌కు అక్కడ చాలా మంది స్నేహితులు ఉన్నారట. అందులో పువ్వాడ రాజా అనే వ్యక్తి ఒకరట. ఇప్పుడాయన అనారోగ్యం బారిన పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి వెంటనే తన స్నేహితునికి మర్చిపోలేని సహాయం చేశారట.

హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి తన స్నేహితుడికి చికిత్సా ఏర్పాట్లు చేశారట. ఈ సంద్భంగానే అపోలో ఆస్పత్రికి వచ్చిన స్నేహితుడి దంపతులను స్వయంగా ఆస్పత్రికి వెళ్లి కలిశారట. వారి బాగోగుల గురించి ఆరా తీశారట. అంతేకాదు వైద్యులతో మాట్లాడి ట్రీట్మెంట్‌ వివరాలను అడిగి తెలుసుకున్నారట. ప్రస్తుతం చిరంజీవికి సంబంధించిన ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు ‘అన్నయ్య మనసు బంగారం’ ‘ ‘దటీజ్‌ మెగాస్టార్‌’, ‘మీరు రియల్‌ హీరో సార్‌’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.. ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్యగా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టారు చిరంజీవి. అయితే భోళాశంకర్‌గా ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. ప్రస్తుతం బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందనుందని సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని అప్‌ డేట్స్‌ రానున్నాయి.

ఇవి కూడా చదవండి

అపోలో ఆస్పత్రిలో మెగాస్టార్ చిరంజీవి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..