Chiranjeevi Cheif Guest:మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా ‘ఓ పిట్టకథ’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

Chiranjeevi Cheif Guest: భారీ చిత్రాల నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకున్న భవ్య క్రియేషన్స్‌ సంస్థ తొలిసారిగా కొత్త తారలతో – కొత్త దర్శకుడితో నిర్మించిన సరికొత్త కంటెంట్‌ ఫిల్మ్‌ ‘ఓ పిట్ట కథ’. విశ్వంత్‌ దుద్దుంపూడి, సంజయ్‌రావు, నిత్యా శెట్టి హీరో హీరోయిన్లుగా, బ్రహ్మాజీ కీలకపాత్రలో నటించిన ఈ చిత్రం మార్చి 6న రిలీజ్‌ కానుంది. చెందు ముద్దు దర్శకత్వంలో వి.ఆనందప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 1న హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ […]

Chiranjeevi Cheif Guest:మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా ‘ఓ పిట్టకథ’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌
Follow us

|

Updated on: Feb 28, 2020 | 8:35 PM

Chiranjeevi Cheif Guest: భారీ చిత్రాల నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకున్న భవ్య క్రియేషన్స్‌ సంస్థ తొలిసారిగా కొత్త తారలతో – కొత్త దర్శకుడితో నిర్మించిన సరికొత్త కంటెంట్‌ ఫిల్మ్‌ ‘ఓ పిట్ట కథ’. విశ్వంత్‌ దుద్దుంపూడి, సంజయ్‌రావు, నిత్యా శెట్టి హీరో హీరోయిన్లుగా, బ్రహ్మాజీ కీలకపాత్రలో నటించిన ఈ చిత్రం మార్చి 6న రిలీజ్‌ కానుంది. చెందు ముద్దు దర్శకత్వంలో వి.ఆనందప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 1న హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని గ్రాండ్‌గా చేయబోతున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొబోతున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత వి. ఆనందప్రసాద్‌ మాట్లాడుతూ –‘‘కథను నమ్మి తీసిన సినిమా ఇది. ఇప్పటికే మా ప్రచార చిత్రాలకు మంచి రెస్సాన్స్‌ లభిస్తోంది. మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా చాలా గ్రాండ్‌గా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ చేయనున్నాం. చిరంజీవి గారి రాకతో మా సినిమాకి ఓ కొత్త ఊపు రాబోతుంది. ఆయన ఈ ఫంక్షన్‌కి రావడానికి అంగీకరించినందుకు చాలా చాలా థ్యాంక్స్‌’’ అన్నారు.

నటీనటులు: విశ్వంత్‌ దుద్దుంపూడి, సంజయ్‌రావు, నిత్యాశెట్టి, బ్రహ్మాజీ, బాలరాజు, శ్రీనివాస్‌ భోగిరెడ్డి, భద్రాజీ, రమణ చల్కపల్లి, సిరిశ్రీ, సూర్య ఆకొండి.

సాంకేతిక నిపుణులు: పాటలు: శ్రీజో , ఆర్ట్: వివేక్‌ అన్నామలై, ఎడిటర్‌: డి.వెంకటప్రభు, కెమెరా: సునీల్‌ కుమార్‌ యన్‌., సంగీతం: ప్రవీణ్‌ లక్కరాజు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: అన్నే రవి, నిర్మాత: వి.ఆనంద ప్రసాద్‌. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం : చెందుముద్దు.

Latest Articles
ఎన్నికల ప్రచారానికి హీరో వెంకటేష్.. ఖమ్మంలో ఆ పార్టీకి మద్దతుగా..
ఎన్నికల ప్రచారానికి హీరో వెంకటేష్.. ఖమ్మంలో ఆ పార్టీకి మద్దతుగా..
వ్యాక్సింగ్ తర్వాత చర్మంపై ఇబ్బందులా.. ఇలా చేయండి..
వ్యాక్సింగ్ తర్వాత చర్మంపై ఇబ్బందులా.. ఇలా చేయండి..
చిన్న ఏలకులు..మాటల్లో చెప్పలేనన్ని, రాయలేనన్ని లాభాలు..!
చిన్న ఏలకులు..మాటల్లో చెప్పలేనన్ని, రాయలేనన్ని లాభాలు..!
మహేష్ సాంగ్‌కు ఈ చిన్నారి ఎలా డాన్స్ చేస్తున్నాడో చూడండి..
మహేష్ సాంగ్‌కు ఈ చిన్నారి ఎలా డాన్స్ చేస్తున్నాడో చూడండి..
బీఆర్‌ఎస్-కాంగ్రెస్ రెండూ ఒక గూటి పక్షులే: ప్రధాని మోదీ
బీఆర్‌ఎస్-కాంగ్రెస్ రెండూ ఒక గూటి పక్షులే: ప్రధాని మోదీ
రాత్రంతా ఏసీ ఆన్ చేసి పడుకుంటున్నారా.? కరెంట్ బిల్లు ఎంతంటే.!
రాత్రంతా ఏసీ ఆన్ చేసి పడుకుంటున్నారా.? కరెంట్ బిల్లు ఎంతంటే.!
కేఎల్ రాహుల్‌తో సహా T20 ప్రపంచకప్‌లో చోటు దక్కని స్టార్ ప్లేయర్లు
కేఎల్ రాహుల్‌తో సహా T20 ప్రపంచకప్‌లో చోటు దక్కని స్టార్ ప్లేయర్లు
మ్యూచువల్ ఫండ్‌లో చక్రవడ్డీ లాభాలు.. పూర్తి వివరాలు తెలుసుకోండి..
మ్యూచువల్ ఫండ్‌లో చక్రవడ్డీ లాభాలు.. పూర్తి వివరాలు తెలుసుకోండి..
కీరా దోసకాయ మాత్రమే కాదు.. తొక్కలతో కోరినంత ఆరోగ్యం..!
కీరా దోసకాయ మాత్రమే కాదు.. తొక్కలతో కోరినంత ఆరోగ్యం..!
మీ కాలి వేళ్లు ఎలా ఉన్నాయి.? దీంతో మీరు ఎలాంటి వారో చెప్పొచ్చు..
మీ కాలి వేళ్లు ఎలా ఉన్నాయి.? దీంతో మీరు ఎలాంటి వారో చెప్పొచ్చు..