Chiranjeevi: నాకు మనవడు కావాలి.. మనసులో కోరిక బయటపెట్టిన చిరంజీవి

బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్‌ నటించిన చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. ప్రియ వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్, వెన్నెల కిశోర్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 14న న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్లలో భాగంగా మంగళవారం(ఫిబ్రవరి 11) బ్రహ్మ ఆనందం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.

Chiranjeevi: నాకు మనవడు కావాలి.. మనసులో కోరిక బయటపెట్టిన చిరంజీవి
Chiranjeevi, Ram Charan

Updated on: Feb 12, 2025 | 11:38 AM

మెగా స్టార్ చిరంజీవి త్వరలోనే విశ్వంభర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మెగాస్టార్ కు జోడీగా ఈ మూవీలో త్రిష నటిస్తుంది. అలాగే ఆమె తోపాటు మరికొంతమంది కూడా ఈ సినిమాలో నటిస్తున్నారని తెలుస్తుంది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు ఇతర సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు గెస్ట్ గాను హాజరవుతున్నారు చిరు. ఇప్పటికే విశ్వక్ సేన్ లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సందడి చేసిన మెగాస్టార్. తాజాగా బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటించిన బ్రహ్మ ఆనందం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరయ్యారు చిరు. ఈ ఈవెంట్ లో చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

బ్రహ్మ ఆనందం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవిని యాంకర్ సుమ కొన్ని ఆసక్తికర ప్రశ్నలు అడిగింది. వాటికి చిరంజీవి తన స్టైల్ లో ఫన్నీగా సమాధానాలు చెప్పారు. సుమ చిరంజీవిని ప్రశ్నలు అడుగుతూ.. బ్రహ్మ ఆనందం సినిమా తాత మనవడు మధ్య జరిగే కథ కావడంతో చిరంజీవి తాతల గురించి సుమ ప్రశ్నలు అడిగింది. చిరంజీవి తాత గారి ఫోటోను చూపించి ఆయన గురించి అడగ్గా.. మా తాత మంచి రసికుడు. నాకు ఇద్దరు అమ్మమ్మలు, బయట ఇంకొకరు కూడా ఉన్నారు అంటూ ఫన్నీ సమాధానం చెప్పారు.

అలాగే చిరంజీవి ఫోటో చూపించి క్లింకార తాతగారు అంటూ ప్రశ్నలు అడిగింది. దానికి చిరు సమాధానం ఇస్తూ.. మా ఇళ్లు ఓ లేడీస్ హాస్టల్ లా ఉంటుంది. నేను హాస్టల్ వార్డెన్ లా ఫీల్ అవుతుంటాను. చరణ్ కు ఒక్క మగబిడ్డను కనరా అని అడుగుతున్నాను..  నా వారసత్వాన్ని కొనసాగించేలా మగబిడ్డను కనమని కోరుతున్నాను అంటూ సరదాగా సమాధానం చెప్పారు మెగాస్టర్. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.