Tollywood: అమ్మ బాబోయ్..! ఈ పాప ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది

|

Oct 06, 2024 | 9:51 PM

తను చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. దూకుడు సినిమాలో సమంత చెల్లిగా కనిపించింది కూడా ఈ అమ్మాయే. తను ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది. రెండ, మూడు సినిమాలు కూడా చేసింది. తన లేటెస్ట్ లుక్ మీరు చూశారా..?

Tollywood: అమ్మ బాబోయ్..! ఈ పాప ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది
Shriya Sharma
Follow us on

టైం చాలా ఫాస్ట్‌గా సాగిపోతుంది. లేకపోతే ఏంటండీ.. . నిన్న మొన్న సినిమాల్లో బాల నటీనటులగా రాణించినవారు.. ఇప్పుడు హీరో, హీరోయిన్స్ అయిపోతున్నారు. ఇప్పటికే తేజ సజ్జ, కావ్య కళ్యాణ్ రామ్ వంటి వాళ్లు లీడ్ రోల్స్‌లో తమ సత్తా చూపించేశారు కూడా. ఇక మెగాస్టార్ చిరంజీవి చిరంజీవి జై చిరంజీవ సినిమా మీ అందరికీ నచ్చే ఉంటుంది. కే విజయ్ భాస్కర్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో భుమిక, సమీరారెడ్డి హీరోయిన్స్‌గా నటించారు. ఈ సినిమాలో మెగాస్టార్ టైమింగ్, యాక్టింగ్ ఓ రేంజ్‌లో ఉంటుంది. అలాగే ఈ సినిమాలో చిరంజీవి మేనకోడలుగా నటించిన బుడ్డది గుర్తుందా..?. తన పాత్ర చుట్టూనే సినిమా అంతా తిరుగుతుంది. ఆ చిన్నదాని పేరు శ్రియ శర్మ.

ఈ చిన్నది బాలనటిగా చాలా సినిమాల్లో కనిపించింది. ఇప్పుడు తను హీరోయిన్ అయిపోయింది. గాయకుడు సినిమాతో కథానాయికిగా ప్రేక్షకులను పలకరించింది. శ్రీకాంత్ తనయుడు హీరోగా వచ్చిన నిర్మల కాన్వెంట్ సినిమాలో నటించింది. ఇప్పుడు కాస్త ఇండస్ట్రీ నుంచి దూరమయ్యి.. ప్రస్తుతం అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేస్తోంది. శ్రియా తల్లి డైటీషియన్ కాగా.. తండ్రి ఇంజనీర్. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పుట్టిన ఈ చిన్నది ఇప్పుడు ఎలా ఉంది అని తెగ వెతికేస్తున్నారు నెటిజన్స్. అందుకే తన లేటెస్ట్ ఫోటోస్ మీ ముందకు తీసుకొచ్చాం.  ఈ బ్యూటీ లేటెస్ట్ ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.