అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్నే మించిపోయిందిగా..!! ఈ అమ్మడిని గుర్తుపట్టారా.?

సినిమాల్లో హీరోలు, హీరోయిన్స్ మాత్రమే కాదు చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్‌లు కూడా తన నటనతో ప్రేక్షకులను అలరించారు. ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్ట్ లు మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్‌లు తమ నటనతో ప్రేక్షకులను మెప్పించారు.

అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్నే మించిపోయిందిగా..!! ఈ అమ్మడిని గుర్తుపట్టారా.?
Hello

Updated on: Jun 22, 2026 | 12:47 PM

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన హలో సినిమా గుర్తుందా.? హీరోగా కెరీర్ మొదలు పెట్టిన తర్వాత అఖిల్ నటించిన రెండో సినిమా హలో. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా పెద్దగా కట్టుకోలేకపోయింది. ఇక ఈ సినిమాలో ఓ చిన్నారి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ మూవీలో జున్ను పాత్రలో నటించి అందరిని మెప్పించింది ఆ చిన్నారి. 2017లో విడుదలైన ఈ మూవీ కమర్షియల్ హిట్ కాకపోయినా క్లాసిక్ సినీప్రియుల హృదయాలను గెలుచుకుంది. మనం సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మలయాళీ ముద్దుగుమ్మ కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటించింది. అప్పట్లో ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది కళ్యాణి. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్టు ఫోటోస్ ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. ఆ చిన్నారి ఇప్పుడు చాలా మారిపోయింది.

ఇది కూడా చదవండి : ఇలాంటి హీరోను ఇన్నాళ్లు ఎందుకు మిస్ అయ్యానా అని ఫీల్ అయ్యా.. ఆయనతో మళ్లీ మళ్లీ సినిమా చేయాలనుంది

అఖిల్ హలో సినిమాలో తన ముద్దు ముద్దు మాటలతో, నటనతో ఆకట్టుకుంది ఓ చిన్నారి. ఇందులో జున్ను పాత్రలో కనిపించింది. సినిమాలో కనిపించింది కొంతసేపే అయినా తన క్యూట్ నటనతో ఆకట్టుకుంది. ఆ సినిమా విడుదలై దాదాపు 9 సంవత్సరాలు అయ్యింది. ఈ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన జున్ను ఆ తర్వాత ఎక్కువగా కనిపించలేదు. ఆ చిన్నారి పేరు మైరా దండేకర్.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : అప్పుడు నాతో కలిసి హోటల్‌లో పని చేశాడు.. ఇప్పుడు పెద్దస్టార్ అయ్యాడు.. కలిస్తే ఎలా ఉంటాడంటే

అప్పట్లో క్యూట్ క్యూట్ మాటలతో కట్టిపడేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు డ్యాన్స్ వీడియోలతో ఫేమస్ అవుతుంది. అలాగే ఆమె లుక్ ఇప్పుడు అందరిని షాక్ అయ్యేలా చేస్తుంది. అలాగే ఇటీవల ఓ నెటిజన్ ఈ చిన్నారి లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేయగా.. ఏంటీ జున్ను ఇంతగా మారిపోయిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. తాజాగా ఆమె హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ ను కలిసి. కళ్యాణి కంటే హైట్ ఉంది ఆ చిన్నది. ఆమెను చూసి కల్యాణి కూడా షాక్ అయ్యింది. ఇందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది.  ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ నిత్యం ఇన్ స్టాలో డ్యాన్స్ వీడియోస్ షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది.

ఇది కూడా చదవండి :Anupama Parameswaran: ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే

హలో మూవీ చైల్డ్ ఆర్టిస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us