Double iSmart: ఇస్మార్ట్ శంకర్ ఈస్ బ్యాక్.. లుక్ మార్చేసిన రామ్.. వీడియో వైరల్

|

Jul 11, 2023 | 1:33 PM

తెలంగాణ యాసలో పూరి పలికించిన డైలాగులు థియేటర్స్ లో ఆడియన్స్ చేత విజిల్స్ కొట్టించాయి. ఇక ఈ సినిమాతో అటు రామ్, ఇటు పూరిజగన్నాథ్ ఇద్దరు సూపర్ హిట్ అను అందుకున్నారు. ఆ తర్వాత రామ్ కు వరుసగా ఫ్లాపులు.. పూరిజగన్నాథ్ కు డిజాస్టర్స్ పలకరించాయి.

Double iSmart: ఇస్మార్ట్ శంకర్ ఈస్ బ్యాక్.. లుక్ మార్చేసిన రామ్.. వీడియో వైరల్
Ram Pothineni
Follow us on

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని.. ఇప్పుడు ఉస్తాద్ రామ్ గా మారిపోయాడు. డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా రామ్ కు సాలిడ్ సక్సెస్ ఇచ్చింది. అలాగే ఉస్తాద్ అనే బిరుదును కూడా తెచ్చిపెట్టింది. మాస్ మసాలా పాత్రలో నటించి మెప్పించాడు రామ్. అలాగే తెలంగాణ యాసలో పూరి పలికించిన డైలాగులు థియేటర్స్ లో ఆడియన్స్ చేత విజిల్స్ కొట్టించాయి. ఇక ఈ సినిమాతో అటు రామ్, ఇటు పూరిజగన్నాథ్ ఇద్దరు సూపర్ హిట్ అను అందుకున్నారు. ఆ తర్వాత రామ్ కు వరుసగా ఫ్లాపులు.. పూరిజగన్నాథ్ కు డిజాస్టర్స్ పలకరించాయి. దాంతో ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి మరోసారి సినిమా చేయనున్నారు. ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కనుంది.

ఈ సినిమాకు డబుల్ ఇస్మార్ట్ అనే టైటిల్ ను ఖరారు చేశారు కూడా.. నటి ఛార్మి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా రీసెంట్ గా పూజాకార్యక్రమాలతో మొదలైంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ను మొదలు పెట్టనున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు రామ్ ఇస్మార్ట్ లుక్ లోకి వచ్చేశారు. ప్రస్తుతం చేస్తున్న బోయపాటి సినిమా కోసం జుట్టు గడ్డం పెంచిన రామ్. ఆ మూవీ షూటింగ్ కంప్లీట్ అవ్వడంతో ఇప్పుడు ఇస్మార్ట్ లుక్ లోకి మారిపోయాడు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సెలూన్ లో రామ్ తన హెయిర్ స్టైల్ మార్చిన వీడియోను నటి ఛార్మీ షేర్ చేశారు. ఇస్మార్ట్ శంకర్ ఈస్ బ్యాక్ అంటూ ఆమె ఈ వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుత  రామ్ బోయపాటి దర్శకత్వంలో స్కంద అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. సెప్టెంబర్ 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.