అందరు హీరోలంటే ఇష్టం.. ఆయన సినిమాను మళ్లీ మళ్లీ చూస్తా.. రోషన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే. గతంలో నిర్మల కాన్వెంట్ అనే సినిమాలో నటించాడు రోషన్. ఈ సినిమాలో నాగార్జున కీలకపాత్రలో నటించాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని పెళ్లి సందడి అనే సినిమా చేశాడు.

అందరు హీరోలంటే ఇష్టం.. ఆయన సినిమాను మళ్లీ మళ్లీ చూస్తా.. రోషన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Roshan

Edited By:

Updated on: Jan 05, 2026 | 6:58 PM

రీసెంట్ గా ఛాంపియన్ సినిమాతో హిట్ అందుకున్నాడు యంగ్ హీరో రోషన్ మేక. నిర్మల కాన్వెంట్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు రోషన్. పెళ్ళిసందడి సినిమాతో హీరోగా మారిన రోషన్.. ఛాంపియన్ సినిమాతో మంచి మంచి విజయం సాధించడంతో పాటు కలెక్షన్స్ పరంగాను దూసుకుపోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుసగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రోషన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. తన సినిమా ప్రయాణం, వ్యక్తిగత అభిరుచులు, సోషల్ మీడియా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తన తండ్రి నటించిన ఖడ్గం సినిమా తనకెప్పటికీ అత్యంత ఇష్టమైన చిత్రమని రోషన్ తెలిపాడు. ఆ చిత్రంలో తన తండ్రి సీరియస్‌నెస్, సెటిల్డ్ పర్ఫార్మెన్స్, డీప్ క్యారెక్టర్ ఎంతో అద్భుతంగా ఉంటాయని చెప్పుకొచ్చాడు రోషన్.

ఖడ్గం సినిమాలో నాన్న పాత్రలో చిన్న చిరునవ్వు కూడా లేకుండా, సీరియస్ ఎమోషన్స్ తో నిండిన పాత్ర.. అది తనకెంతో నచ్చిందని, భవిష్యత్తులో అవకాశం వస్తే అలాంటి పాత్రను చేయాలని ఉందని రోషన్ తెలిపారు. సినిమాలు చూసేటప్పుడు కొన్నిసార్లు ఎమోషనల్ అవుతాను, ముఖ్యంగా మాస్, ఎలివేషన్ సీన్లు ఉన్న ఎంటర్‌టైనర్లను బాగా ఎంజాయ్ చేస్తానని రోషన్ తెలిపాడు. అయితే, ఏడుపు వచ్చేంతగా ఎమోషనల్ కానని, కానీ ఆ ప్రభావం కొంతకాలం తనపై ఉంటుందని చెప్పాడు రోషన్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సలార్ సినిమాలోని కొన్ని సన్నివేశాలను తాను రిపీట్ మోడ్‌లో చూశానని రోషన్ వెల్లడించారు.

ముఖ్యంగా, సలార్ చిత్రంలోని కాటేరమ్మ ఫైట్ సీక్వెన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్ తనకెంతో నచ్చాయని అన్నాడు. ఇదే కోవలో యానిమల్ వంటి మాస్, యాక్షన్ సినిమాలు చూడటానికి ఇష్టపడతానని, అయితే తెరపై వాటిని చేయడం మాత్రం చాలా కష్టమైన పని అని రోషన్ అన్నాడు. సోషల్ మీడియాలో హడావిడి, నెగటివిటీ ఎక్కువగా ఉంటాయని, కామెంట్లు చదవడం అనేది పెద్ద రోగంఅని ఆయన రోషన్ అన్నాడు. కామెంట్లు చదివితే వచ్చే నెగిటివిటీ మన ప్రవర్తనపై పడుతుందని, అది తన వ్యక్తిగత జీవితానికి అనవసరమైన ఒత్తిడిని కలిగిస్తుందని రోషన్ స్పష్టం చేశారు. అందుకే తాను కామెంట్లు చదవడానికి ఇష్టపడనని, తన వ్యక్తిగత జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. అల్లు అర్జున్, రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ వంటి అందరు హీరోల సినిమాలను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటం తన అలవాటు అని, ఎవరి సినిమాను మిస్ అవ్వనని రోషన్ తెలిపాడు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.