Chaitanya Jonnalagadda-Niharika Konidela: విడాకులు కన్ఫార్మ్ చేసిన నిహారిక.. చైతన్య రియాక్షన్ ఏంటంటే..

చైతన్య నేను పరస్పరం విడిపోవాలని నిర్ణయించుకున్నాం. కనుక అందరూ సంయమనంతో ఉండాలని కోరుకుంటున్నాను.. ఈ నిర్ణయంపై నాకు మద్దతుగా నిలిచిన నా కుటుంబం, స్నేహితులకు ధన్యవాదాలు. మేమిద్దరం మరో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు మాకు కాస్త ప్రైవసీ కావాలి. అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను-నిహారిక కొణిదెల

Chaitanya Jonnalagadda-Niharika Konidela: విడాకులు కన్ఫార్మ్ చేసిన నిహారిక.. చైతన్య రియాక్షన్ ఏంటంటే..
Niharika, Chaitanya

Updated on: Jul 05, 2023 | 2:49 PM

మెగా బ్రదర్ నాగబాబు తనయ నిహారిక కొణిదెల.. చైతన్య జొన్నలగడ్డ తమ వివాహబంధానికి ముగింపు పలికారు. గత కొన్నాళ్లుగా జరుగుతున్న ప్రచారానికి ఎట్టకేలకు తెర పడింది. వీరిద్దరు విడాకులు తీసుకున్నారని.. ఇద్దరు విడిపోయారంటూ కొద్ది రోజులుగా వార్తలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ క్రమంలోనే తనకు చైతన్యతో డైవర్స్ అయ్యిందని నిహారిక ఇన్ స్టాలో ఓ ప్రకటన విడుదల చేసింది. “చైతన్య నేను పరస్పరం విడిపోవాలని నిర్ణయించుకున్నాం. కనుక అందరూ సంయమనంతో ఉండాలని కోరుకుంటున్నాను.. ఈ నిర్ణయంపై నాకు మద్దతుగా నిలిచిన నా కుటుంబం, స్నేహితులకు ధన్యవాదాలు. మేమిద్దరం మరో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు మాకు కాస్త ప్రైవసీ కావాలి. అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను-నిహారిక కొణిదెల” అంటూ ఓ నోట్ రిలీజ్ చేసింది నిహారిక.

ఇదిలా ఉంటే.. సోషల్ మీడియా వేదికగా ముందుగా నిహారిక తమ విడాకుల గురించి ప్రకటించింది. అయితే తమ విడాకుల గురించి చైతన్య తొలిసారి స్పందించారు. నిహారిక తాను పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నామని.. వేరు వేరుగా కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నామని.. ఈ విషయంలో తమకు మద్దతు ఇచ్చిన కుటుంబం, స్నేహితులకు ధన్యవాదాలని .. ఈ విషయంపై కాస్త ప్రైవసీ కావాలని కోరుతూ మరో నోట్ విడుదల చేశారు. అయితే గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో సైలెంట్ గా ఉన్న చైతన్య.. ఇటీవలే ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేశారు. ప్రస్తుతం అతను ముంభైలోని గ్లోబల్ విపాసన పగోడా మెడిటేషన్ సెంటర్‏లో ఉన్నట్లు ఓ ఫోటో షేర్ చేశారు.

ఇవి కూడా చదవండి

తనను అక్కడికి వచ్చేలా చేసిన వారందరికి ధన్యవాదాలని… మనం ఎక్కడికైనా ఎలాంటి ఆలోచనలు లేకుండా వెళ్తే.. అద్భుతమైన జ్ఞానంతో తిరిగి వస్తామని.. అది కూడా అలాంటిదే అంటూ రాసుకోచ్చాడు.ఇదిలా ఉంటే.. కొన్నాళ్ల క్రితమే వీరిద్దరు ఇన్ స్టాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడం.. పెళ్లి ఫోటోస్ డెలీట్ చేసుకోవడంతో వీరిద్దరు విడిపోతున్నట్లు ప్రచారం జరిగింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us