ఇటీవల కాలంలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సంచలనం సృష్టించిన చిత్రం మహావతార్ నరసింహ. ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేకున్నప్పటికీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే రూ. 230 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన మహావతార్ భారతదేశంలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన యానిమేటెడ్ సినిమాగా రికార్డుల కెక్కింది. ఇప్పటికీ ఈ సినిమా థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతోంది. కాగా శ్రీ మహావిష్ణువు నరసింహావతారం ఆధారంగా కన్నడలో రూపొందిన ఈ సినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. సామాన్య ప్రేక్షకులతో పాటు వివధ రంగాలకు చెందిన ప్రముఖులు మహావతార్ నరసింహ సినిమాను చూసి తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. తాజాగా ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు ఈ సినిమాను చూశారు. శుక్రవారం (ఆగస్టు 15) అల్లు అరవింద్, శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు వరప్రసాద్ రెడ్డి తో కలిసి ఆయన ఈ సినిమాను చూశారు. అనంతరం సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
‘మన పురాణాలకు చాలా దగ్గరగా మహావతార్ నరసింహ సినిమా ఉంది. భక్త ప్రహ్లాద వంటి సినిమా ఇప్పటికీ ప్రజల మదిలో ఉండిపోయింది. నరసింహ స్వామి.. హిరణ్యాక్షుడి పురాణ కథను మనుషులతో కాకుండా బొమ్మలతో తీసినప్పటికి సహజంగా..కనువిందుగా..నిజంగా దైవిక అనుభవాన్ని అందించేలా తెరకె్కించారు. ఈ సినిమా చూస్తుంటే నిజంగా నరసింహ అవతారాన్ని చూసిన అనుభూతి కలిగింది. ముఖ్యంగా చివరి సన్నివేషం చాలా అద్భుతంగా ఉంది. కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని చూడొచ్చు’ అని చాగంటి చెప్పుకొచ్చారు.
Chaganti Koteswara Rao garu and K.I. Vara Prasad Reddy garu share their thoughts on #MahavatarNarsimha, applauding the team for delivering a truly divine experience.
Witness the divine saga at theatres near you. 🔥pic.twitter.com/qtHfd7XsJw
— Geetha Arts (@GeethaArts) August 15, 2025
ఇందుకు సంబంధించిన వీడియోను గీతా ఆర్ట్స్, హోంబలే ఫిల్మ్స్ తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశాయి. ‘మహావతార్ నరసింహ’ చిత్రాన్ని కేవలం రూ. 40 కోట్ల బడ్జెట్‌తో హోంబలే ఫిల్మ్స్‌తో కలిసి క్లీమ్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. అశ్విన్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
The roaring love from Hyderabad continues… 🦁❤️🔥
Director @AshwinKleem visited AAA Cinemas & Mythri Vimal Theatre for #MahavatarNarsimha screening and witnessed a phenomenal response from the audience.pic.twitter.com/mZjF0HxihQ
— Geetha Arts (@GeethaArts) August 5, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.