లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు సెన్సార్ సర్టిఫికేట్ వచ్చేసింది

|

Mar 25, 2019 | 9:10 PM

లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ విషయంలో ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. సినిమా విడుదల అవుతుందా లేదా అనే తీవ్ర ఉత్కంఠ మధ్య సెన్సార్ బోర్డ్ లైన్ క్లియన్ చేసింది. చిన్నపాటి సీన్లు కట్ చేయడం మినహా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మూవీకి సెన్సార్ బోర్డు క్లీన్ యూ సర్టిఫికేట్‌ ఇచ్చిందన్న విషయాన్ని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో వెల్లడించాడు. దీంతో వర్మ చెప్పినట్టుగానే సినిమా మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎన్నికల […]

లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు సెన్సార్ సర్టిఫికేట్ వచ్చేసింది
Follow us on

లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ విషయంలో ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. సినిమా విడుదల అవుతుందా లేదా అనే తీవ్ర ఉత్కంఠ మధ్య సెన్సార్ బోర్డ్ లైన్ క్లియన్ చేసింది. చిన్నపాటి సీన్లు కట్ చేయడం మినహా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మూవీకి సెన్సార్ బోర్డు క్లీన్ యూ సర్టిఫికేట్‌ ఇచ్చిందన్న విషయాన్ని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో వెల్లడించాడు. దీంతో వర్మ చెప్పినట్టుగానే సినిమా మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఎన్నికల కోడ్‌కు ఈ మూవీ వ్యతిరేకంగా ఉందని ఫిర్యాదు అందడంతో తొలుత బ్రేకులు పడ్డాయి. దీంతో నిర్మాత రాకేశ్ రెడ్డి ఎలక్షన్ కమీషన్‌కు రాతపూర్వక వివరణ ఇచ్చారు. స్వయంగా వెళ్లి కలిశారు కూడా. ఇంకా అభ్యంతరాలు ఏమైనా ఉంటే సినిమా విడుదలైన తర్వాత కూడా వివరణ ఇస్తానని రాకేశ్ రెడ్డి చెప్పారు. ఈ సినిమా ఏ పార్టీకి వ్యతిరేకం కాదని, జరిగిన వాస్తవాన్ని మాత్రమే చూపించామని ఆయన చెప్పారు.

ఈ మూవీలో ఎన్టీఆర్ పాత్రలో ఆర్టిస్ట్ విజయ్ కుమార్, లక్ష్మీపార్వతి పాత్రలో కన్నడ నటి యజ్ఞశెట్టి, చంద్రబాబు పాత్రలో శ్రీతేజ్ నటించారు. రామ్ గోపాల్ వర్మ, ఆగస్త్య మంజు దర్శకత్వం వహించారు. నిర్మాత రాకేశ్ రెడ్డి, దీప్తి బాలగిరి ఈ చిత్రాన్ని నిర్మించారు.