Sirivennela Seetharama Sastry: మెత్తని ప్రేమకు.. నెత్తుటి యుద్ధానికి.. కొత్త అర్ధం చెప్పిన సిరివెన్నెల

|

Dec 01, 2021 | 8:08 AM

సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణంతో సినీలోకానీ చిక్కటి కమ్మేసింది.. పాటకు మాట పడిపోయింది. సినీవినీలాకాశం నుంచి ఓ ధ్రువతార నేల రాలింది.

Sirivennela Seetharama Sastry: మెత్తని ప్రేమకు.. నెత్తుటి యుద్ధానికి.. కొత్త అర్ధం చెప్పిన సిరివెన్నెల
Follow us on

Sirivennela Seetharama Sastry: సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణంతో సినీలోకానీ చిక్కటి కమ్మేసింది.. పాటకు మాట పడిపోయింది. సినీవినీలాకాశం నుంచి ఓ ధ్రువతార నేల రాలింది. కొద్దిరోజులు అనారోగ్యం తో చికిత్స పొందుతున్న సీతారామ శాస్త్రి మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. న్యూమోనియాతో బాధపడుతున్న సిరివెన్నెల మరోసారి అస్వస్థతకు గురికావడంతో ఈనెల 24న సికింద్రాబాద్‏లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అప్పటినుంచి ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్న కిమ్స్ వైద్యులు ఎప్పటికప్పుడు సిరివెన్నెల ఆరోగ్యాన్ని పరీశిలిస్తూ వచ్చారు. కానీ చివరకు ఆరోగ్యం విషమించడంతో నవంబర్ 31న తిరిగిరానిలోకాలకు వెళ్లిపోయారు.  ఆయన పార్థివ దేహాన్ని అభిమానులు, సినీప్రముఖులు సందర్శనాంర్ధం ఫిలింఛాంబర్ కు తరలించారు.

సిరి వెన్నెలను కడసారి చూసేందుకు.. సినిమాతారలు , అభిమానులు తరలి వస్తున్నారు. ఇప్పటికే రాజమౌళి, కీరవాణి, క్రిష్, గుణశేఖర్, తనికెళ్ళ భరణి, హీరో వెంకటేష్, సునీల్, రావు రమేష్, మారుతి, ఎస్ వి కృష్ణ రెడ్డి, సింగర్ సునీత మొదలైన వారు నివాళ్లు అర్పించారు. తనికెళ్ళ భరణి మాట్లాడుతూ కన్నీటిపర్యంతం అయ్యారు. సినిమా శూన్యంగా మారింది అన్నారు. ఒక వటవృక్షం కూలిపోయిందని తనికెళ్ళ భరణి ఎమోషనల్ అయ్యారు. దర్శకుడు త్రివిక్రమ్ దగ్గరనుండి అన్నీ చూసుకుంటున్నారు. హీరో వెంకటేష్ ఎమోషనల్ అయ్యారు

మరిన్ని ఇక్కడ చదవండి :

Sirivennela Seetharama Sastry: ‘మీరు కన్ను మూస్తే.. మాకు ఈ ప్రపంచం చీకటయ్యింది…’

Sirivennela Seetharama Sastry: ఆయన సంతకం కోసం ప్రయత్నించా కానీ చివరకు.. భావోద్వేగానికి గురైన రాజమౌళి..

Sirivennela: సాహితీ లోకానికి సిరివెన్నెల మిగిల్చిన చివరి గుర్తులు ఇవే.. సీతరామశాస్త్రి రాసిన చివరి పాట ఏంటో తెలుసా.?