Mahesh Babu: మహేష్ అభిమానులపై కేసు .. అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవంటూ..
కోనసీమ జిల్లా పేరును డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తామంటూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే.
అమలాపురంలో సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు చేసిన హంగామాపై కేసు నమోదు చేశారు కోనసీమ జిల్లా పోలీసులు.. సెక్షన్ 30 అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు కోనసీమ జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి. సెక్షన్ 30 అమలులో ఉండగా అమలాపురంలో హీరో మహేష్ బాబు అభిమానులు చేసిన హంగామా పై కేసు నమోదు చేశారు.. కోనసీమజిల్లాను డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మార్పు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని… ఎవరికైనా ఎటువంటి అభ్యంతరాలున్నా, సూచనలున్నా తెలియచేయాలన్నారు. 30రోజులు గడువు ఇవ్వడంతో పాటు కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామని.. సెక్షన్ 30 అమలులో ఉన్నందున డీఎస్పీ అనుమతి లేకుండా ఎటువంటి ర్యాలీలు, ధర్నాలు, ప్రదర్శనలు నిర్వహించరాదన్నారు.. ఒకవేళ నిబంధనలు అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని.. కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
కోనసీమ జిల్లా పేరును డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తామంటూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. జిల్లా పేరు మార్చడానికి ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర కలకలం రేపింది. జిల్లా మార్చడానికి వీల్లెదంటూ భారీగా ఆందోళనకారులు నిరసనకు దిగారు..రోడ్డుపై ర్యాలీలు.. ధర్నాలు చేస్తూ కలెక్టర్‌ను ముచ్చటించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో పోలీసులు అమలాపురంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా అమలాపురంలో సెక్షన్ 30 అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. సెక్షన్ 30 అమలులో ఉండగా.. అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు, ధర్నాలు చేయకూడదని ఎస్పీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ క్రమంలో మహేష్ బాబు అభిమానులు వందలాది మంది రోడ్డుపైకి చేరుకుని ప్రముఖుల విగ్రహాల వద్ద మహేష్ కటౌట్స్ ఏర్పాటు చేశారు. జై బాబు అంటూ నినదాలు చేస్తూ రోడ్డుపై హంగామా సృష్టించారు. దీంతో మహేష్ అభిమానులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు కోనసీమ పోలీసులు..