Bandla Ganesh: నిర్మాత బండ్ల గణేష్ పై కేసు నమోదు.. కారణం ఇదే..

ఫిల్మ్ నగర్‏లో తనకు చెందిన రూ. 75 కోట్ల విలువైన ఇంటిని కబ్జా చేసేందుకు బండ్ల గణేష్ ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదులో పేర్కోన్నారు. కొన్నిరోజులుగా హీరా గ్రూపు సీఈఓకు చెందిన ఇంట్లో బండ్ల గణేష్ అద్దెకు ఉంటున్నారు. అయితే తన ఇంట్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ.. ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఇంటిని కబ్జా చేసేదుంకు ప్రయత్నిస్తున్నారని..

Bandla Ganesh: నిర్మాత బండ్ల గణేష్ పై కేసు నమోదు.. కారణం ఇదే..
Bandla Ganesh

Updated on: May 03, 2024 | 10:56 AM

సినీ నిర్మాత బండ్ల బండ్ల గణేష్ మీద ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్‎లో కేసు నమోదైంది. ఫిల్మ్ నగర్‏లో తనకు చెందిన రూ. 75 కోట్ల విలువైన ఇంటిని కబ్జా చేసేందుకు బండ్ల గణేష్ ప్రయత్నిస్తున్నారని హీరా గ్రూప్ సీఈఓ నౌహీరా షేక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్నిరోజులుగా హీరా గ్రూపు సీఈఓకు చెందిన ఇంట్లో బండ్ల గణేష్ అద్దెకు ఉంటున్నారు. అయితే తన ఇంట్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ.. ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఇంటిని కబ్జా చేసేదుంకు ప్రయత్నిస్తున్నారని.. ఇంటినీ ఖాళీ చేయమని అడిగేందుకు వెళ్ళిన తనను నిర్బంధించి బెదిరింపులకు పాల్పడుతున్నారని నౌహీరా షేక్ ఆరోపించారు.

ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని.. తిరిగి తన మీదనే ఫిలిం నగర్ పోలీసులు కేసు నమోదు చేయడంతో డీజీపీకి ఫిర్యాదు చేశాుడ నౌహీరా షేక్. ఈ వ్యవహారం పై ఉన్నతాధికారుల ఆదేశంతో బండ్ల గణేష్ మీద ఐపిసి 341,506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఫిలిం నగర్ పోలీసులు.

ఫిల్మ్ నగర్ లోని రూ. 75 కోట్ల విలువైన నౌహీరా షేక్ ఇంట్లో బండ్ల గణేష్ అద్దెకు ఉంటున్నారు. నెలకు రూ. లక్షల చెప్పున అద్దె చెల్లించాల్సి ఉంది. అయితే కొంతకాలంగా అద్దె ఇవ్వకపోగా.. రౌడీలతో తనను బెదిరిస్తున్నారని తనను ఇంట్లోకి కూడా రానివ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. రౌడీలు, రాజకీయ నాయకుల అండతో తన ఇంటిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు నౌహీరా షేక్.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.