ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మళ్లీ చిక్కుల్లో పడ్డారు. ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘చంద్రయాన్ 3’ ప్రాజెక్టును అపహాస్యం చేస్తూ పోస్ట్ షేర్ చేయడమే దీనికి కారణం. ట్విట్టర్‌లో ఓ కార్టూన్‌ను పోస్ట్ చేసిన ప్రకాశ్ రాజ్.. ‘బ్రేకింగ్ న్యూస్ చంద్రుడిపై చంద్రయాన్ 3 తీసిన తొలి ఫోటో అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ కార్టూన్‌లో ఓ వ్యక్తి లుంగి కట్టుకుని.. టీ పోస్తున్నట్లు ఉంటాడు. ప్రకాశ్ రాజ్ షేర్ చేసిన ఈ పోస్ట్ షేర్ చేసిన క్షణాల్లోనే వైరల్‌గా మారింది. ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించే ప్రకాశ్ రాజ్ ఈ పోస్ట్ పెట్టారంటూ నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆయనపై మండిపడుతున్నారు. దేశ ప్రతిష్ఠకు ప్రతీకగా నిలుస్తోన్న ఇస్రో చంద్రయాన్ 3 ప్రాజెక్టును ఇలా ఎగతాళి చేయడం కాదంటూ నటుడిపై ట్రోలింగ్‌కు దిగారు. ట్వీట్ వైరల్ కావడం, నెటిజన్లు ట్రోలింగ్‌కు దిగడంతో ప్రకాశ్ రాజ్ తన పోస్టుకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘ద్వేషించే వారికి అంతా ద్వేషమే కనిపిస్తుంది. అది నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ కాలం నాటి జోక్. దీనిని అర్థం చేసుకోకుండా ఎవరికి వారు విమర్శిస్తే ఎలా? నేను కేరళ చాయ్‌వాలాను ఉద్దేశించి ఆ పోస్ట్ చేశాను. మీరు ఏ చాయ్‌వాలా కావాలనుకుంటున్నారో’ అని మరోసారి వ్యంగంగా ట్వీట్ చేశారు ప్రకాశ్ రాజ్. దీంతో ఈ వివాదం మరింత రచ్చ కెక్కింది.
ప్రకాశ్ రాజ్ షేర్ చేసిన పోస్టులు చంద్రయాన్ 3 ప్రాజెక్టును అపహాస్యం చేసేలా ఉన్నాయంటూ బీజేపీ నేతలు, హిందూ సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఈ మేరకు కర్ణాటకలోని భాగల్ కోట్ జిల్లా బాన హట్టి పోలీస్ స్టేషనల్‌లో ఆయనపై కేసు నమోదైంది. ఇస్రో శాస్త్రవేత్తల కృషిని ప్రకాశ్ రాజ్ అవమానిస్తున్నారంటూ హిందూ సంఘాల నేతలు ఆయనపై మండిపడ్డారు. ప్రకాశ్ రాజ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆ ఫిర్యాదులో డిమాండ్ చేశారు హిందూ సంఘాల నేతలు. మరోవైపు చంద్రయాన్ 3 ప్రయోగంలో భాగంగా విక్రమ్ ల్యాండర్.. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ మోపనుంది. ఈ ప్రయోగం విజయవంతం కావాలని దేశవ్యాప్తంగా పూజలు జరుగుతున్నాయి.
Hate sees only Hate.. i was referring to a joke of #Armstrong times .. celebrating our kerala Chaiwala .. which Chaiwala did the TROLLS see ?? .. if you dont get a joke then the joke is on you .. GROW UP #justasking https://t.co/NFHkqJy532
— Prakash Raj (@prakashraaj) August 21, 2023
#MannKiBaat #justasking https://t.co/I1OVuHOg4e
— Prakash Raj (@prakashraaj) August 20, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.