
హీరోయిన్ నిధి అగర్వాల్ పట్ల కొందరు అభిమానులు ప్రవర్తించిన తీరు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సింగర్ చిన్మయి తదితర సినీ ప్రముఖులు అభిమానుల తీరును తప్పుపడుతున్నారు.
బుధవారం (డిసెంబర్ 17)హైదరాబాద్ లో ‘ది రాజా సాబ్’ సినిమా పాటల విడుదల కార్యక్రమంలో ఈ సంఘటన జరిగింది. ఒక ప్రైవేట్ మాల్ లో ఏర్పాటు చేసిన సాంగ్ రి లీజ్ ఈవెంట లో హీరోయిన్ నిధి అగర్వాల్ పాల్గొంది. ఆ సమయంలో , పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. చాలా మంది అభిమానులు ఒకేసారిగా నిధి అగర్వాల్ తో ఫోటోలు దిగడానికి ఎగబడ్డారు. ఇదే సమయంలో కొంతమంది ఆమెతో అసభ్యకరంగా, దురుసుగా ప్రవర్తించారు. ఇప్పుడు ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. నిధి అగర్వాల్ ను అభిమానులు చుట్టుముట్టిన వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. చివరికీ బాడీ గార్డ్స్ సహాయంతో ఆమె అక్కడి నుంచి సురక్షితంగా బయటపడింది. ఈ క్రమంలో నిధి అగర్వాల్ కూడా తీవ్ర మనస్తాపానికి గురైంది. కారు ఎక్కగానే ఆమె తీవ్ర ఆగ్రహంతో కనిపించారు.
కాగా ‘ది రాజా సాబ్’ చిత్రంలోని ‘సహానా సహానా..’ పాట విడుదలైంది. ఈ పాటను బుధవారం (డిసెంబర్ 17) సాయంత్రం 5 గంటలకు విడుదల చేయాల్సి ఉంది. అయితే ఈ కార్యక్రమం చాలా ఆలస్యం అయింది. ఆ సమయానికి, భారీ సంఖ్యలో అభిమానులు గుమిగూడారు. ఇదే క్రమంలో నిధి అగర్వాల్ పట్ల కొందరు అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో, పోలీసులు కేసు నమోదు చేశారు. సరైన అనుమతి లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మాల్ తో పాటు ఈవెంట్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.
Thank you for the overwhelming response to #SahanaSahana Your love has made this moment truly special ✨ ✨🤍🤍🤍♥️♥️♥️#TheRajaSaab #Prabhas @DirectorMaruthi @AgerwalNidhhi @MusicThaman @vishwaprasadtg @peoplemediafcy @SKNOnline #KrithiPrasad @AAFilmsIndia @ivyofficial2023… pic.twitter.com/8jwtZfD5dq
— Nidhhi Agerwal (@AgerwalNidhhi) December 18, 2025
కాగా ఈ సంఘటన గురించి నిధి అగర్వాల్ ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే ఆమె పట్ల అభిమానులు ప్రవర్తించిన తీరును చాలా మంది ఎండగడుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.