Actress : నాగార్జున, రజినీకాంత్‏తో సినిమాలు.. ఇప్పటికీ తగ్గని క్రేజ్.. ఈ చిన్నారి నాట్యమయూరి ఎవరో గుర్తుపట్టారా..?

80's, 90's లలో సినీరంగంలో చక్రం తిప్పిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అందులో ఈ భామ ఒకరు. ఒకప్పుడు తెలుగు, తమిళం, మలయాళం స్టార్ హీరోలతో కలిసి నటించిన ఆమె.. ఇప్పటికీ సెకండ్ ఇన్నింగ్స్ లో రాణిస్తుంది. 55 ఏళ్ల వయసులోనూ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటుంది. ఇంతకీ చిన్నారి నాట్యమయూరి ఎవరో గుర్తుపట్టారా..?

Actress : నాగార్జున, రజినీకాంత్‏తో సినిమాలు.. ఇప్పటికీ తగ్గని క్రేజ్.. ఈ చిన్నారి నాట్యమయూరి ఎవరో గుర్తుపట్టారా..?
Shobhana

Updated on: Oct 20, 2025 | 1:02 PM

అభిమానులు ఎల్లప్పుడూ తారల, చిన్ననాటి ఫోటోస్ గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. తారలు సమయం దొరికినప్పుడల్లా, వారి జీవిత వివరాలను, పాత జ్ఞాపకాలను సోషల్ మీడియాలో అభిమానుల కోసం పంచుకుంటారు. ఆమె 80వ, 90వ దశకం అడియన్స్ ఫేవరేట్ హీరోయిన్. ప్రస్తుతం ఆమె చిన్ననాటి ఫోటో సోషల్ మీడియా హృదయాలను దోచుకుంటోంది. పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి నాట్యమయూరి ఎవరో గుర్తుపట్టారా.. ?ఆమె ఒకప్పుడు స్టార్ హీరోయిన్. ఆమె మరెవరో కాదు శోభన. ఆ చిత్రాన్ని శోభన అభిమానుల పేజీ ‘విడామాటెక్స్’లో షేర్ చేశారు. శోభన చిన్ననాటి అనేక చిత్రాలు ఈ పేజీలో పంచుకుంది. ప్రస్తుతం ఈ చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, కమల్ హాసన్‏తో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు విదేశాల్లో వ్యాపారాలు.. ఈ బ్యూటీ క్రేజ్ వేరప్పా..

దక్షిణాది సినీప్రియులకు శోభన ఇష్టమైన హీరోయిన్. ఎనభైలు, తొంభైలలో అనేక చిత్రాలతో ఇండస్ట్రీలో స్టార్ డమ్ సంపాదించుకుంది. చిరంజీవి, రజినీకాంత్, మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇప్పటికీ సినిమాల్లో యాక్టివ్ గా ఉంటుంది. సీనియర్ హీరోలకు జోడిగా కనిపిస్తుంది. అలాగే ఇటీవల మోహన్ లాల్ జోడిగా తుడురమ్ సినిమాలో నటించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అలాగే కంటెంట్ ప్రాధాన్యతను బట్టి మరిన్ని చిత్రాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తుంది శోబన.

ఇవి కూడా చదవండి : Serial Actress: అబ్బబ్బో.. అదరగొట్టేస్తోన్న రుద్రాణి అత్త.. నెట్టింట గ్లామర్ గత్తరలేపుతున్న సీరియల్ విలన్..

ప్రస్తుతం ఆమె వయసు 55 సంవత్సరాలు. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా జీవిస్తుంది. చిన్నప్పటి నుంచి శాస్త్రీయ నృత్యం నేర్చుకున్న శోభన.. ఇప్పుడు చాలా మంది విద్యార్థులకు నృత్యం నేర్పిస్తుంది. తన జీవితాన్ని నృత్యానికే అంకితం చేసింది. అలాగే తన డ్యాన్స్ క్లాసులకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.

ఇవి కూడా చదవండి : 43 ఏళ్ల వయసులో ఇంత స్లిమ్‏గా.. ఈ హీరోయిన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనట..