
తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అతి తక్కువ సమయంలో స్టార్ డమ్ సంపాదించుకోవడమే కాకుండా అందం, అద్భుతమైన నటనతో అడియన్స్ హృదయాల్లో చోటు సంపాదించుకుంది. తెలుగులో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. చిన్నప్పటి నుంచి IAS కావాలని ఎన్నో కలలు కన్న ఈ అమ్మడు.. ఇప్పుడు మాత్రం సౌత్ టూ నార్త్ ఇండస్ట్రీలో చక్రం తిప్పుతుంది. చిన్నప్పటి నుంచి చదువుల్లో ముందు ఉండే ఈ అమ్మడు కాలేజీ టాపర్. అయితే నటనపై ఆసక్తి రావడంతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు పోషించింది. ఆ తర్వాత కమర్షియల్ యాడ్స్ చేసింది. ముఖ్యంగా వాసెలిన్ యాడ్ ద్వారా చాలా పాపులర్ అయ్యింది. దీంతో ఆమెకు సినిమాల్లో అవకాశాలు క్యూ కట్టాయి. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషలలో బ్యాక్ టూ బ్యా్క్ సినిమాలు చేసి మెప్పించింది. కట్ చేస్తే.. తెలుగులో కెరీర్ మంచి ఫాంలో ఉండగానే బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది. ఇన్నాళ్లు తెలుగులో ట్రెడిషనల్ లుక్ మెయింటైన్ చేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు హిందీలో మాత్రం గ్లామర్ లిమిట్స్ క్రాస్ చేసింది. తాజాగా స్విమ్మింగ్ ఫూల్ రెడ్ డ్రెస్ లో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.. ? తనే హీరోయిన్ రాశీ ఖన్నా.
తెలుగు సినీరంగంలో అగ్ర కథానాయికగా తనదైన ముద్ర వేసింది. నాగశౌర్య నటించిన ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన ఈ అమ్మడు.. మొదటి సినిమాతోనే కుర్రాళ్ల హృదయాలను గెలుచుకుంది. ఆ తర్వాత మరిన్ని ఆఫర్స్ రావడంతో తక్కువ సమయంలోనే నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో యంగ్ హీరోల అందరి సరసన నటించి మెప్పించింది. కానీ ఈ బ్యూటీకి అనుకున్నంత స్టార్ డమ్ మాత్రం రాలేదు. ఇప్పుడు తెలుగులో హిందీలో చక్రం తిప్పుతుంది.
జాన్ అబ్రహం సరసన మద్రాస్ కేఫ్ సినిమాతో హిందీలో సినీప్రయాణం స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇటీవలే ది సబర్మతి రిపోర్ట్ మూవీతో మరో హిట్ అందుకుంది. అంతకుముందు సిద్ధార్థ్ మల్హోత్రా సరసన యోధ చిత్రంలో నటించింది. ప్రస్తుతం హిందీలో వరుస ఆఫర్స్ అందుకుంటుంది రాశీ. అలాగే ఇటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం గ్లామర్ పిక్స్ షేర్ చేస్తుంది.
ఇవి కూడా చదవండి :
Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..
Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..
OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..