Actress : వామ్మో.. 96 కిలోల బరువు తగ్గిన స్టార్ హీరోయిన్.. ఇప్పుడు సన్నజాజి తీగలా..

వెండితెరపై హీరోహీరోయిన్స్ గా రాణించడం అంత సులభం కాదు. ప్రతిభతోపాటు ఫిట్నెస్ విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా హీరోయిన్స్ తమ లుక్, ఫిట్నెస్ విషయంలో ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు. కానీ ఇప్పుడు ఓ హీరోయిన్ మాత్రం ఏకంగా 96 కిలోల బరువు తగ్గింది. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ? ఆమెకు అధిక ఫాలోయింగ్ ఉంది.

Actress : వామ్మో.. 96 కిలోల బరువు తగ్గిన స్టార్ హీరోయిన్.. ఇప్పుడు సన్నజాజి తీగలా..
Sara Ali Khan

Updated on: Aug 12, 2025 | 8:09 PM

ప్రస్తుతం సినిమా రంగుల ప్రపంచంలో ఆమె స్టార్ హీరోయిన్. సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. తనదైన ప్రతిభతో జనాలకు దగ్గరయ్యింది. అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లలో ఒకరు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో థియేటర్లలో సందడి చేస్తుంది. అలాగే ఎప్పటికప్పుడు తన ఫ్యాషన్, ఫిట్నెస్ విషయంలో జనాలను కట్టిపడేస్తుంది. పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ఆమె ఇప్పుడు అగ్రకథానాయిక. నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టింది. సినిమాల కోసం ఏకంగా 96 కిలోల బరువు తగ్గింది. ఇప్పుడు సన్నజాజి తీగలా సినీప్రియులను మెస్మరైజ్ చేస్తుంది. ఆమె మరెవరో కాదండి.. బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్.

ఇవి కూడా చదవండి : Cinema: థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఓటీటీని శాసిస్తోన్న సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం బాలీవుడ్‌లో అత్యంత ఫిట్‌గా, గ్లామరస్‌గా ఉన్న హీరోయిన్లలో సారా అలీ ఖాన్ ఒకరు. ఈ రోజు సారా 29వ పుట్టినరోజు. సారా చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి కలిగి ఉంది. కానీ టీనేజ్ లో పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ సమస్యతో బాధపడుతూ అధికంగా బరువు పెరిగింది. చిన్నవయసులోనే సారా ఏకంగా 96 కిలోల బరువు దాటింది. PCOS వల్ల హార్మోన్ల అసమతుల్యత, జీవక్రియ మందగించడం, వేగంగా బరువు పెరగడం జరిగింది. కానీ నటనపై ఆమెకున్న ఆసక్తి.. ధైర్యంగా ఆ సమస్యను ఎదుర్కొంది. అందుకు 45 కిలోల బరువు తగ్గాలని నిర్ణయించుకుంది.

ఇవి కూడా చదవండి : Arundhathi: కొరియోగ్రాఫర్‏ను పెళ్లి చేసుకోబోతున్న అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్.. ఫ్రెండ్స్‏తో బ్యాచిలర్ పార్టీ..

తన మొదటి సినిమా చేసే ముందు బరువు తగ్గాలని డైరెక్టర్ కరణ్ జోహార్ సలహా ఇచ్చారని సారా గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కార్డియో, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, యోగా, డ్యాన్స్ వంటి వ్యాయామాలు చేస్తూ బరువు తగ్గేందుకు ప్రయత్నించిందట. ముఖ్యంగా బరువు తగ్గేందుకు వ్యాయమాలు చేయడానికి ఎక్కువగా డ్యాన్స్ చేసేదట. అలాగే జంక్ ఫుడ్, చక్కెరకు దూరంగా ఉంటూ.. పుష్కలంగా నీరు, పండ్లు, కూరగాయలు మరియు ప్రోటీన్-రిచ్ ఫుడ్స్ తీసుకుందట. PCOSని నియంత్రించడం.. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడంలో వ్యాయమం ఎంతో సహయపడింది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కూతురే సారా అలీ ఖాన్.

ఇవి కూడా చదవండి : Cinema : 4 ఏళ్లుగా ఓటీటీని శాసిస్తున్న మహేష్ బాబు సినిమా.. 75 కోట్లు పెడితే రూ.214 కోట్లు కలెక్షన్స్..

ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 9 ఏళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తోన్న సినిమా.. ఇప్పటికీ ఓటీటీలో సెన్సేషన్..