
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం హరి హర వీరమల్లు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ మూవీలో నిధి అగర్వాల్ కథానాయికగా నటించింది.అలాగే విలన్ గా బాబీ డియోల్ కనిపించనున్నాడు. వీరితో పాటు నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తోన్న ఈ చిత్రం జూన్ 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడ్ పెంచారు మేకర్స్. తాజాగా ఈ పీరియాడికల్ మూవీ నుంచి ‘తార తార’ అని లిరిక్స్ తో సాగే పాటను విడుదల చేశారు మేకర్స్. ఇందులో పవన్, నిధిల స్టెప్పులు అభిమానలను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ సాంగ్ మేకింగ్ వీడియోలో టాలీవుడ్ కు చెందిన ఒక క్రేజీ డైరెక్టర్ అనూహ్యంగా మెరిశాడు. అయితే ఈ డైరెక్టర్ నటుడిగా మెరవడం ఇదేమీ మొదటి సారి కాదు. ఆ మధ్యన ప్రభాస్ నటించిన కల్కి సినిమా, అలాగే ఇటీవల రిలీజైన మ్యాడ్ 2 మూవీలోనూ క్యామియో రోల్స్ లో కనిపించాడు. ఇప్పుడు పవన్‌కల్యాణ్ ` హరి హర వీరమల్లు` సినిమాలోనూ మెరిశాడు.
పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన వీర మల్లు సినిమాలో ఈ డైరెక్టర్ గెటప్ కూడా విచిత్రంగా ఉంది. బాగా ఫోకస్ చేసి చూస్తే తప్ప అతనిని గుర్తు పట్టలేం. మరి మీరు గుర్తు పట్టారా? అతనెవరో కాదు జాతి రత్నాలు సినిమా డైరెక్టర్ అను దీప్. మరి ఈ ఒక్కపాటలోనే అతను మెరిశాడా? లేదా? సినిమాలో మరిన్ని సీన్లలో కనిపిస్తాడా? అన్నది వీర మల్లు రిలీజయ్యాక కానీ క్లారిటీ రాదు.
Naku matramae naa?
Meekunkuda anipisthondhaa ???Ikkadunnadi Jathi Ratnalu director Anudeep K V naa?#HariHaraVeeraMallu 🦅 🎯 🔥 Powerstar #PawanKalyan garu 🤙🏻 #NidhiAgerwal pic.twitter.com/tbgldoUpYq
— 𝔸𝕔𝕥𝕦𝕒𝕝ℙ𝕦𝕝𝕤𝕖🦅 (@ActualPulse) May 28, 2025
మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు హరి హర వీరమల్లు సినిమాను నిర్మించారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఈ సినిమాకు స్వరాలందించారు.
The heat has landed! 🔥
Volume max…vibe max! 🔊#TaaraTaara – The sizzling single from #HariHaraVeeraMallu is out now! 🔊💃A @mmkeeravaani Musical 🥁🎻🎹
✍️ @SriharshaEmani #AbbasTyrewala @pavijaypoet @Aazad_Varadaraj #MankombuGopalakrishnan
🎙️… pic.twitter.com/LnqH95UMLf— Hari Hara Veera Mallu (@HHVMFilm) May 28, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.