AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ ఫోటోలోని పాప ఎవరో గుర్తుపట్టారా..? ఇప్పుడు తోపు హీరోయిన్.. అంతేకాదు..

ఈ చిత్రంలోని కరాటే కిడ్ ఎవరో గుర్తుపట్టగలరా..? తను ఇప్పుడు తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో స్టార్ హీరోయిన్. అందంలో అప్సరస. అభినయంలో తిరుగులేదు. లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూనే.. రొమాంటిక్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తుంది. మీరు తనని గుర్తుపట్టగలరా..? .. ..

Tollywood: ఈ ఫోటోలోని పాప ఎవరో గుర్తుపట్టారా..? ఇప్పుడు తోపు హీరోయిన్.. అంతేకాదు..
Heroine Childhood Photo
Ram Naramaneni
|

Updated on: Dec 01, 2025 | 3:04 PM

Share

ఈ మధ్య ఏ సోషల్  మీడియా ప్లాట్‌ఫామ్ ఓపెన్ చేసినా  సెలబ్రిటీల ఫోటోలో కనిపిస్తున్నాయి. ఫ్యాన్స్.. పోటి పడుతూ వారు అభిమానించే స్టార్స్ ఫోటోలు ట్రెండ్ చేస్తున్నారు. అకేషన్ ఉన్నా.. లేకపోయినా ఈ తంతు కొనసాగుతూనే ఉంది. తాజాగా మీ ముందుకు ఇండస్ట్రీలో మంచి పేరున్న హీరోయిన్ చిన్ననాటి ఫోటోను తీసుకొచ్చాం. ఈమెకు చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. టాలీవుడ్‌తో పాటు కోలివుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణించింది. హీరో స్థాయి స్టేటస్ దక్కించుకుని.. ఫిమేల్ ఓరియంటెడ్ మూవీస్ కూడా చేసింది. కష్టపడి పని చేయడం.. సినిమా కోసం ప్రాణం పెట్టడం తనకు అలవాటు. ఆమె అందానికి ప్రేక్షకులు ఎప్పుడో క్లీన్ బౌల్డ్ అయ్యారు. ఇప్పుడు వెబ్ సిరీస్‌లలోనూ మెప్పిస్తుంది ఈ తార. ఇంతకీ ఈ నటిమణి ఎవరో మీరు గుర్తుపట్టారా..?

తనెవరో కాదు.. అందం, నటనతో తెలుగు ప్రేక్షకులను మాయ చేసిన సమంత.  ‘ఏమాయ చేసావె’ మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు సమంత. ఆ సినిమా హీరో నాగచైతన్యను 2017లో వివాహం చేసుకున్నారు. అత్యంత వైభవంగా హిందూ, క్రైస్టవ సంప్రదాయాల ప్రకారం వీరిద్దరి వివాహం జరిగింది. అయితే, పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్టు 2021లో ప్రకటించింది ఈ జంట. టాలీవుడ్‌ అందమైన జంటల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్న వీరిద్దరూ విడిపోవడం అప్పట్లో సంచలన వార్త. ఎందుకు విడిపోయారనే విశ్లేషణలు ప్రముఖంగా జరిగాయి. తాజాగా గత కొన్ని నెలలుగా టాక్‌ ఆఫ్‌ది ఇండస్ట్రీగా నిలిచిన సమంత-రాజ్‌ నిడిమోరు జంట ఎట్టకేలకు మూడుముళ్లతో ఒక్కటయింది. కోయంబత్తూర్‌లోని ఈశా ఫౌండేషన్‌ లింగభైరవి ఆలయంలో ఈ వివాహ వేడుకలు జరిగాయి.

విడాకుల తర్వాత సమంత కెరీర్‌ మీద ఫోకస్‌ చేశారు. అయితే, యశోద సినిమా చేస్తున్న సమయంలో ఆమె మయోసైటిస్‌కి గురయ్యారు. అప్పటికప్పుడు నీరసపడిపోతున్నానంటూ మయోసైటిస్‌ గురించి అభిమానులతో పంచుకున్నారు. అంతే కాదు, ఆ వ్యాధి లక్షణాలు, దాన్ని నయం చేసుకోవడానికి పడుతున్న పాట్లు, చికిత్సా విధానం.. ఇలా ప్రతిదాన్నీ ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు పంచుతూనే ఉన్నారు సామ్‌. ఈ క్రమంలోనే ఆమెకు రాజ్‌తో సాన్నిహిత్యం ఏర్పడింది. రాజ్‌ – సామ్‌ రిలేషన్‌ షిప్‌ గురించి రకరకాల వార్తలు మొదలయ్యాయి. సామ్‌ విడాకులు తీసుకున్న మరుసటి ఏడాది రాజ్‌ వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పడం కూడా అప్పట్లో వార్తల్లో నలిగింది. ఆ తర్వాత సమంత ట్రాలాలా పిక్చర్స్‌ని ప్రారంభించి శుభం మూవీ చేశారు. ఈ సినిమాకు రాజ్‌ నిడిమోరు క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. చెన్నై పికిల్‌ బాల్‌ టీమ్‌కి వీరిద్దరూ కో ఓనర్స్‌గా వ్యవహరిస్తున్నారు. పికిల్‌ బాల్‌ ఈవెంట్లకు సామ్‌ వెళ్లినప్పుడు, ఆమె చెయ్యి పట్టుకుని రాజ్‌ నడిపించిన తీరు కూడా అప్పట్లో బాగా ఫ్లాష్‌ అయింది.

ఆ మధ్య సమంత ప్రారంభించిన పెర్ఫ్యూమ్‌, పర్సనల్‌ కేర్‌ బ్రాండ సీక్రెట్‌ ఆల్కమిస్ట్ లాంచ్‌ ఈవెంట్‌కి రాజ్‌ అటెండ్‌ అయ్యారు. పబ్లిక్‌గా కనిపించడానికి వీరిద్దరూ ఎప్పుడూ మొహమాటపడలేదు. సామ్‌ షేర్‌ చేసిన చాలా పిక్చర్స్ లో రాజ్‌ కనిపిస్తూనే ఉన్నారు. ఫ్యామిలీ ఫంక్షన్లలోనూ ఇద్దరూ తరచుగా కనిపిస్తున్నారు. ఈ మధ్య సామ్‌ సొంత ఇల్లు కొనుగోలు చేశారు. ఆ గృహప్రవేశానికి సంబంధించిన పూజల్లో సామ్‌పక్కన రాజ్‌ ఉన్నారనే వార్తలు వైరల్‌ అయ్యాయి. ఆమె పక్కన కూర్చున్న వ్యక్తి రాజ్‌ అని, అప్పటికే వీరిద్దరూ రిలేషన్‌ని చెప్పకనే చెప్పారని అన్నారు. సామ్‌ – రాజ్‌ రిలేషన్‌ గురించి మీడియా చెప్పినదానికన్నా ఎక్కువగా రాజ్‌ మాజీ భార్య రియాక్ట్ అయిన సందర్భాలున్నాయి. ప్రత్యక్షంగా కాకపోయినా, పరోక్షంగా ఆమె చేసిన కామెంట్లు వారి రిలేషన్‌ షిప్‌ని కన్‌ఫర్మ్ చేసిందన్నది నెటిజన్ల మాట. సామ్‌కీ, రాజ్‌కీ మధ్య దాదాపు 12 ఏళ్ల ఏజ్‌ గ్యాప్‌ ఉంది. రాజ్‌ 1975లో పుట్టగా, సామ్‌ 1987లో పుట్టారు.

కొంత స్ట్రగుల్‌.. కొంత మానసిక ఒత్తిడి.. ఇంకొన్ని సూటిపోటి మాటలు అన్నీ దాటుకుని వ్యక్తిగత జీవితంలో మరో అడుగు ముందుకేశారు సమంత. తాజాగా బాలీవుడ్‌ డైరెక్టర్‌ కమ్‌ ప్రొడ్యూసర్‌ రాజ్‌ను పెళ్లాడారు.. అత్యంత సన్నిహితుల సమక్షంలో మూడుముళ్ల సాక్షిగా ఒక్కటయ్యారు. పెళ్లి గురించి ఇటు సమంత నుంచి, అటు రాజ్‌ నిడిమోరుగా నుంచి అధికారిక ప్రకటన రాలేదు. సన్నిహితులైతే దీన్ని కన్ఫామ్‌ చేశారు.  ఫ్యామిలీమేన్‌ సీరీస్‌ చేసినప్పటి నుంచీ సామ్‌కీ, రాజ్‌ నిడిమోరుకి పరిచయం ఉంది. వారి కాంబినేషన్‌లో ఈ మధ్య సిటాడెల్‌ కూడా విడుదలైంది. ప్రస్తుతం రక్త్ బ్రహ్మండ్‌ సెట్స్ మీద ఉంది. ఈ సీరీస్‌ ఆగిపోయిందని వార్తలొచ్చాయి. కానీ, అలాంటిదేమీ లేదని మేకర్స్ స్పష్టం చేశారు.

రాజ్‌ నిడిమోరు తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ ఇంజినీరింగ్‌ కాలేజీలో చదువుకున్నారు. డైరక్టర్‌గా, స్క్రీన్‌ రైటర్‌గా, నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. డీకేతో కలిసి రాజ్‌ డీకేగా ప్రాజెక్టులు చేస్తున్నారు. కెరీర్‌ తొలినాళ్లలోనే షామాలీ డేని వివాహం చేసుకున్నారు రాజ్‌. అయితే 2022లో వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు ఆ మొదటి భార్యే వీళ్లిద్దరి పెళ్లిని కన్‌ఫామ్ చేసేలా కొన్ని లీకులు ఇచ్చారు. తెగించిన వాళ్ల పనులు దానికి తగ్గట్టే ఉంటాయంటూ శ్యామాలి పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ వైరల్ అయిన కొన్ని గంటలకే వీళ్లిద్దరి పెళ్లి అఫీషియల్ అయ్యింది.