చైల్డ్ ఆర్టిస్టులు.. హీరో హీరోయిన్లుగా ఎంట్రీలు ఇవ్వడం ఈ మధ్య తెలుగు ఇండస్ట్రీలో బాగా చూస్తున్నాం. వెండితెర మీద మాత్రమే కాదు.. బుల్లితెర మీద కూడా వారి హవానే ఎక్కువగా ఉంది. పలు సినిమాల్లో అలరిస్తూ దూసుకుపోతున్నారు. మంచి ఫ్యాన్ బేస్ కూడా సెట్ చేసుకుంటున్నారు. పైన ఫోటోలో ఉన్న అబ్బాయిని గుర్తుపట్టారా..? తను ఇప్పుడు ఆర్టిస్ట్‌గా దూసుకుపోతున్నాడు. పై ఫోటోలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మంచు విష్ణు చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని తీసుకుంటున్న ఈ కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.. ప్రస్తుతం ఈ కుర్రాడు నటుడిగా మారి పలు చిత్రాల్లో, వెబ్ సిరీస్‌లలో, సీరియల్స్‌లో హీరోగా అలరిస్తున్నాడు. పైగా ఇతగాడికి ఫ్యాన్ ఫ్యాలోయింగ్ కూడా భారీగా ఉంది. ఇంతకీ ఎవరో కనిపెట్టారా..
పై ఫోటోలో కనిపిస్తున్న ఈ కుర్రాడు ఇప్పుడు బుల్లితెర టాప్ స్టార్లలో ఒకడు. అంతేకాకుండా.. ఈ కుర్రోడు ఇప్పుడు పలు సినిమాల్లో, వెబ్ సిరీస్‌లలోనూ తన తమ మార్క్ చూపిస్తున్నాడు. అతడు మరెవరో కాదు… బుల్లితెర హీరో ‘మానస్ నాగులపల్లి’. ఈయన ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న సీరియల్ ‘బ్రహ్మముడి’లో హీరోగా అలరిస్తున్నాడు. ఇక ఈ హీరోకి అమ్మాయిల ఫాలోయింగ్ నెక్ట్స్ లెవల్‌లో ఉంది. మానస్ చైల్డ్ ఆర్టిస్టుగా కూడా చేశాడు. ఈ క్రమంలోనే.. మానస్ మొదటిగా 2004లో మహేష్ బాబు, శ్రియ జంటగా నటించిన ‘అర్జున్’ సినిమాలో బాలనటుడిగా వెండితెరకు పరిచయమైయ్యాడు. ఇక ఈ సినిమా తర్వత వీడే, నరసింహనాయుడు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. ఆ తర్వాత.. వెండితెరపై 2015లో హీరోగా ‘ఝలక్’ మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఫస్ట్ సినిమాతోనే మంచి నటుడిగా మార్కులు వేసుకున్న మానస్ ఆ తర్వాత కాయ్ రాజా కాయ్, అతను, కై రాజా కై, ప్రేమికుడా, గోలి సోడా, మొదలైన చిత్రాల్లో నటించాడు. ఇక వెండితెరపై అలరించిన మానస్ ఆ తర్వాత బుల్లితెరకు వచ్చి.. భలే ఛాన్సులే, కోయిలమ్మా, కార్తీకదీపం వంటి ధారావాహికల్లో అలరించాడు. దీని తర్వాత తెలుగు బిగ్ బాస్ సీజన్ 5లో కూడా ఎంట్రీ ఇచ్చి ఫ్యాన్స్ బేస్ పెంచుకున్నాడు.
ఇటీవలే మాన్షన్ అనే వెబ్ సిరీస్‌లో కూడా మానస్ అలరించాడు. గత ఏడాది ఈ హీరో ఒక ఇంటివాడు అయ్యాడు. 2023 నవంబర్ 22న శ్రీజ అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తూ.. మరోవైపు ప్రొఫిషినల్‌గా కూడా మంచిగా రాణిస్తున్నాడు మానస్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.