Tollywood: ఓర్నీ.. అరుంధతి సినిమాలో ఈ పాప ఇప్పుడు హీరోయిన్.. నెక్ట్స్ లెవల్‌లో
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన లేడీ ఓరియెంటెడ్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘అరుంధతి’. లెజెండరీ డైరెక్టర్ కోడీ రామకృష్ణ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో చిన్ననాటి అరుంధతి పాత్రలో నటించిన పాప గుర్తుందా..? తను ఇప్పుడు ఎలా ఉంది..? ఏం చేస్తోంది..?
కోడి రామకృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ లెజెండ్. ఆయన టచ్ చేయని జోనర్ లేదు. విభిన్న ప్రయోగాలు చేసి.. మంచి సక్సెస్ అందుకున్నారు. ఆయన దర్శకత్వంలోనే వచ్చింది బ్లాక్ బాస్టర్ మూవీ అరుంధతి. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా అప్పట్లో సంచలనం క్రియేట్ చేసింది. 2009 లో వచ్చిన ఈ సినిమాకు ఎన్నో అవార్డులు, రివార్డులు దక్కాయి. ఏడు విభాగాల్లో రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారాలని అందుకుంది ఈ చిత్రం. ఈ సినిమా తర్వాత అనుష్క పేరు మోత మోగిపోయింది. తన యాక్టింగ్ స్కిల్స్‌కు జనాలు మెస్మరైజ్ అయ్యారు. అరుంధతి సినిమాలో చిన్ననాటి అరుంధతిగా నటించిన చిన్నారి గుర్తుందా.? గ ఆమె ఇప్పుడు ఎలా ఉంది.? ఎం చేస్తుంది తెలుసుకుందాం పదండి.
ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన చిన్నారి పేరు దివ్య నగేష్. అరుంధతి చిత్రంతో ఈ చిన్నారికి మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఇప్పుడు ఈ చిన్నది పూర్తి గ్లామర్ మోడ్‌లోకి మారిపోయింది. అంతేకాదు హీరోయిన్‌గా మలయాళంలో పలు సినిమాలు చేసింది. తెలుగులోనూ నేను నాన్న అబద్దం అనే చిత్రంలో హీరోయిన్‌గా చేసింది.
ప్రస్తుతం దివ్య నగేష్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో ఫాలోవర్స్‌తో టచ్‌లోనే ఉంటుంది. తాజాగా ఈ అమ్మడికి సంబందించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నెట్టింట ఈ అమ్మడి ఫోటోలు చూసిన ఆడియెన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఆ పాపయేనా ఈ బ్యూటీ అని స్టన్ అవుతున్నారు. దివ్య నగేష్ లేటెస్ట్ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.