
ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఉన్న టాప్ హీరోయిన్లలో ఈ క్రేజీ బ్యూటీ ఒకరు. బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఈ ముద్దుగుమ్మకు నెట్టింట ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేసే గ్లామర్ రచ్చ గురించి చెప్పక్కర్లేదు. నిత్యం గ్లామరస్ పిక్స్ షేర్ చేస్తూ నెట్టింట అగ్గిరాజేస్తుంది. ఇన్నాళ్లు హిందీలో వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఈ బ్యూటీ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తుంది. భారీ బడ్జెట్తో నిర్మించిన పాన్ ఇండియా మూవీలో ఈ హీరోయిన్ నటిస్తుంది. త్వరలోనే ఆ సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా..? చిన్ని కృష్ణుడిగా ముద్దులొలుకుతున్న ఆ చిన్నారి ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్. తను మరెవరో కాదు.. బీటౌన్ బ్యూటీ దిశా పటానీ. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమాలో కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
2015లో వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది దిశా పటానీ. ఈ మూవీతోనే కథానాయికగా సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత హిందీలో వరుస ఆఫర్స్ అందుకుంది. దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన ఎంఎస్ ధోని సినిమాలో దిశా నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమాతో ఆమెకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఇందులో దిశా నటనకు అభిమానుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించిపెట్టింది. ఎంఎస్ ధోని సినిమా తర్వాత హిందీలో దిశాకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.
భాఘీ 2, మలంగ్ వంటి యాక్షన్ చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో రాబోతున్న కల్కి 2898 ఏడీ చిత్రంలో నటిస్తుంది. ఇందులో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం కల్కి ప్రమోషన్లలో పాల్గొంటుంది దిశా పటానీ.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.