
చిన్న సినిమాలుగా మంచి మంచి విజయాలను అందుకున్న సినిమాలు చాలా ఉన్నాయి. కంటెంట్ ఉంటే చాలు సినిమా బడ్జెట్ తో సంబంధంలేకుండా హిట్ సాదించవచ్చు అని చాలా సినిమాలు నిరూపించాయి. ముఖ్యంగా యూత్ ను ఆకట్టుకునే కథలను తెరకెక్కించి చాలా మంది మంచి సక్సెస్ సాధించారు. పెద్ద పెద్ద స్టార్స్ అవసరం లేదు.. భారీ బడ్జెట్ కూడా అక్కర్లేదు. కేవలం కథ , కథ మీదున్న నమ్మకం చాలు సినిమా ప్రేక్షకుల్లోకి వెళ్ళడానికి. ఎలాంటి అంచనాలు లేకున్నా కూడా సినిమాలు హిట్ టాక్ ను తెచ్చుకుంటున్నాయి. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్దపెద్ద మార్కెట్ ఉన్న హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే.. చిన్న హీరోలు మంచి కంటెంట్ ఉన్న సినిమాలను తెరకెక్కించి హిట్స్ అందుకుంటున్నారు. అలా వచ్చిన ఓ సినిమాలోని హీరోయినే పైన కనిపిస్తున్న భామ. ఇప్పటికే ఆ సినిమా ఎదో మీకు గుర్తొచ్చే ఉంటుంది. ఈ సినిమాలో ఆ అమ్మడి పాత్ర చాలా మందికి కనెక్ట్ అయ్యింది. చాలా మంది మగాళ్ల జీవితంలో అలాంటి ఓ అమ్మాయి ఉంటుంది. ఇంతకు పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ను గుర్తుపట్టారా.?
పై ఫొటోలో హీరోయిన్ ఎవరో కాదు హుషారు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ పేరు ప్రియా వడ్లమాని. ఈ సినిమాలో ప్రేమించిన వాడిని మోసం చేసే పాత్రలో కనిపించింది ప్రియా. 2018లో వచ్చిన ప్రేమకు రెయిన్ చెక్ సినిమాతో సినిమాల్లోకి అడుగుపెట్టింది ఈ చిన్నది. అదే ఏడాది ఈ అమ్మడు శుభలేఖలు, హుషారు సినిమాల్లో నటించింది. అయితే హుషారు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత ఈ చిన్నది చాలా మంది ఫెవరెట్ హీరోయిన్ అయ్యింది కానీ ఎక్కువ సినిమాలతో బిజీ కాలేకపోయింది.
హుషారు సినిమా తర్వాత చిన్న చిన్న సినిమాల్లో నటించింది. చివరిగా ఓం భీమ్ బుష్ సినిమాలో కనిపించింది ప్రియా. హుషారు తర్వాత ఆవిరి, కాలేజ్ కుమార్, ముఖచిత్రం, మను చరిత్ర సినిమాల్లో కనిపించింది. వీటిలో ఓం భీమ్ బుష్ సినిమాకొకటి కాస్త చెప్పుకోదగ్గ సినిమా. కాగా సోషల్ మీడియాలో ప్రియా చాలా యాక్టివ్ గా ఉంటుంది. కాగా ఈ అమ్మడి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ప్రియా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. హుషారు సినిమాలో సన్నగా ఉన్న ఈ బ్యూటీ. ఈ వీడియోలో మాత్రం బొద్దుగా కనిపిస్తుంది. ఈ అమ్మడి లుక్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. కానీ ఈవీడియో పాతది అని తెలుస్తోంది. ఇప్పుడు తిరిగి సన్నజాజిలా మారింది ప్రియా. ఇక నెట్టింట ఈ అమ్మడు షేర్ చేసే ఫోటోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.