Tollywood: బాబోయ్.. అచ్చతెలుగమ్మాయి ఇలా మారిందేంటీ.. హాలీవుడ్ మ్యాగజైన్ పై ఈ బ్యూటీ ఎవరో తెలుసా..?

|

May 16, 2024 | 4:24 PM

కావ్య కళ్యాణ్ రామ్, శ్రీవిద్య, తేజ సజ్జా వంటి స్టార్స్ అంతా బాలనటులుగా కనిపించినవాళ్లే. కానీ ఒక అమ్మాయి మాత్రం ఇప్పుడు హాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేస్తుంది. చిన్న వయసులోనే నటిగా కెరీర్ ప్రారంభించిన ఆ అమ్మాయి.. ఇప్పుడు హాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తుంది. అంతేకాకుండా తాజాగా ప్రముఖ హాలీవుడ్ మ్యాగజైన్ పై ఊహించని లుక్ లో కనిపించింది. పైన ఫోటోను చూశారు కదా.. ఆ అమ్మాయి ఎవరో గుర్తుపట్టండి. తెలుగులో పలు చిత్రాలు, యాడ్స్ చేసి అలరించింది. ఇప్పుడు కథానాయికగా దూసుకుపోతుంది.

Tollywood: బాబోయ్.. అచ్చతెలుగమ్మాయి ఇలా మారిందేంటీ.. హాలీవుడ్ మ్యాగజైన్ పై ఈ బ్యూటీ ఎవరో తెలుసా..?
Avantika
Follow us on

టాలీవుడ్ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టులుగా సినీ ప్రయాణం మొదలుపెట్టి ఇప్పుడు హీరోహీరోయిన్లుగా రాణిస్తున్నవారు చాలా మంది ఉన్నారు. అనేక చిత్రాల్లో క్యూట్ నటనతో ఆకట్టుకుని ఇప్పుడు స్టార్ నటులుగా తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. కావ్య కళ్యాణ్ రామ్, శ్రీవిద్య, తేజ సజ్జా వంటి స్టార్స్ అంతా బాలనటులుగా కనిపించినవాళ్లే. కానీ ఒక అమ్మాయి మాత్రం ఇప్పుడు హాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేస్తుంది. చిన్న వయసులోనే నటిగా కెరీర్ ప్రారంభించిన ఆ అమ్మాయి.. ఇప్పుడు హాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తుంది. అంతేకాకుండా తాజాగా ప్రముఖ హాలీవుడ్ మ్యాగజైన్ పై ఊహించని లుక్ లో కనిపించింది. పైన ఫోటోను చూశారు కదా.. ఆ అమ్మాయి ఎవరో గుర్తుపట్టండి. తెలుగులో పలు చిత్రాలు, యాడ్స్ చేసి అలరించింది. ఇప్పుడు కథానాయికగా దూసుకుపోతుంది. తనే అవంతిక వందనపు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం సినిమాలో బాలనటిగా కనిపించింది. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమాలో నటించింది. కొన్నాళ్లపాటు బుల్లితెరపై పలు వాణిజ్య ప్రకటనలు చేసింది. అమెరికన్ ఇండియన్ అయిన అవంతిక ప్రస్తుతం హాలీవుడ్ లో సినిమాలు చేస్తుంది. స్పిన్ మూవీతో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఇటీవలే మీన్ గర్ల్ మూవీతో హిట్ అందుకుంది. ఇందులో అవంతిక నటనకు హాలీవుడ్ ఫిదా అయ్యింది. దీంతో అక్కడ ఆమెకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. మోక్షి, సీనియర్ ఇయర్, మీన్ గర్ల్స్, టారోట్ చిత్రాల్లో నటించిన అవంతిక.. పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటుంది. అటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది అవంతిక. గతంలో తన ఇంగ్లీష్ ఆక్సెంట్ పై వచ్చిన ట్రోల్స్ ఎంతో హుందగా స్పందించింది.

ఇదిలా ఉంటే.. తాజాగా హాలీవుడ్ మ్యాగజైన్ గలోరి కవర్ పేజీపై ఫోటోలకు ఫోజులిచ్చింది అవంతిక. హాలీవుడ్ లో రాణిస్తున్న బ్లాక్ బ్యూటీస్ ని హైలెట్ చేస్తుంటుంది ఈ మ్యాగజైన్. ఇక తాజాగా గలొరి మ్యాగజైన్ కవర్ పేజీపై పబ్లిష్ అయిన అవంతిక గ్లామర్ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. హెయిర్ కలర్ మార్చేసి.. పూర్తిగా హాలీవుడ్ అమ్మాయిల కనిపిస్తున్న అవంతికను చూసి షాకవుతున్నారు నెటిజన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.