ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్ అందుకున్న చిరు.. ఇప్పుడు విశ్వంభర చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బింబిసార మూవీతో మంచి విజయాన్ని అందుకుని ఇండస్ట్రీలో ఫేమస్ అయిన డైరెక్టర్ వశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో త్రిషతోపాటు ఆషికా రంగనాథ్ కూడా కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ మూవీపై క్యూరియాసిటిని పెంచేశాయి. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది. ఇదిలా ఉంటే.. తాజాగా సోషల్ మీడియాలో చిరంజీవికి సంబంధించిన ఓ త్రోబ్యాక్ ఫోటో నెట్టింట తెగ వైరలవుతుంది. అందులో చిరు ఓ చిన్నోడుని గట్టిగా పట్టుకుని కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఆ ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
పైన ఫోటోను చూశారు కదా.. అందులో చిరుతోపాటు కనిపిస్తున్న ఆ చిన్నోడు ఎవరో తెలుసా.. ? ఒకప్పటి స్టార్ హీరో తనయుడు. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి హీరోగా తెరంగేట్రం చేస్తూ సినీ ప్రియులకు దగ్గరవుతున్నాడు. అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇంతకీ అతడు ఎవరంటే .. సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్. అన్నయ్యతో నా కుమారుడు అంటూ గతంలో శ్రీకాంత్ షేర్ చేసిన ఫోటో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. నిర్మాల కాన్వెంట్ సినిమాతో బాలనటుడిగా వెండితెరకు పరిచయమైన రోషన్.. ఆ తర్వాత పెళ్లి సందడి సినిమాతో హీరోగా మారాడు.
డైరెక్టర్ రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో తెరకెక్కించిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ అందుకుంది. 2021లో విడుదలైన ఈ మూవీలో శ్రీలీల కథానాయికగా అలరించింది. ప్రస్తుతం రోషన్ హీరోగా ఛాంపియన్ చిత్రంలో నటిస్తున్నాడు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఇటీవలే అధికారిక ప్రకటన వచ్చింది. ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ వైజయంతి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.
రోషన్ ఇన్ స్టా పోస్ట్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.