Tollywood : అమ్మాయ్ కాదండోయ్.. ఇండస్ట్రీలోనే తోపు హీరో.. ఇప్పుడేం చేస్తున్నారంటే..

నాట్యమయూరి గెటప్ లో నవ్వుతూ ఉన్న ఈ అందమైన అమ్మాయి ఎవరో తెలుసా.. ? దక్షిణాది సినీప్రియులకు ఇష్టమైన హీరో. తెలుగు, తమిళం, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇంతకీ ఈ హీరో ఎవరో తెలుసా..

Tollywood : అమ్మాయ్ కాదండోయ్.. ఇండస్ట్రీలోనే తోపు హీరో.. ఇప్పుడేం చేస్తున్నారంటే..
Vineeth

Updated on: Sep 17, 2025 | 5:40 PM

పైన ఫోటోలో కనిపిస్తున్న సెలబ్రెటీ అమ్మాయి కాదండోయ్.. అబ్బాయి.. ఒకప్పుడు టాప్ హీరో. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటించిన ఫేమస్ హీరో. చిన్నప్పటి నుంచి క్లాసికల్ డ్యాన్సర్. ఇప్పటికీ శాస్త్రీయ నృత్యం నేర్పిస్తున్నారు. అతడు మరెవరో కాదండి.. హీరో వినీత్. మలయాళంతో పాటు తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషలలో నటించాడు. వినీత్ తలస్సేరిలోని సెయింట్ జోసెఫ్ బాలుర ఉన్నత పాఠశాలలో చదువుకున్నాడు.

ఇవి కూడా చదవండి : Tollywood : 19 ఏళ్ల వయసులో 31 ఏళ్ల స్టార్ హీరోతో పెళ్లి.. 11 సంవత్సరాలకు రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..

వినీత్ ప్రముఖ నృత్యకారిణి, హీరోయిన్ శోభన కజిన్. నీత్ తన పాఠశాల రోజుల నుండి భరతనాట్యంలో అనేక బహుమతులు గెలుచుకున్నాడు. రాష్ట్ర పాఠశాల యువజన ఉత్సవంలో భరతనాట్య పోటీలో వరుసగా నాలుగు సార్లు మొదటి స్థానం గెలుచుకున్నాడు. వినీత్ కళాప్రతిభ పట్టాను కూడా అందుకున్నాడు. 1985లో పదహారేళ్ల వయసులో ఐ.వి. శశి దర్శకత్వం వహించిన ‘ఎడనిలమంగల్’ చిత్రంతో వినీత్ నటుడిగా అరంగేట్రం చేశాడు. తరువాత, వినీత్ ప్రధాన పాత్ర, సహాయ పాత్రలు పోషించారు. 1986లో విడుదలైన నక్కక్షతంగల్ చిత్రంతో ఆయన చాలా మంది దృష్టిని ఆకర్షించారు. వినీత్ 2004లో వివాహం చేసుకున్నాడు. అతని భార్య ప్రసిల్లా మీనన్.

ఇవి కూడా చదవండి : Actress: అప్పుడు స్కూల్లో టీచర్.. తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?

వినీత్ ఇటీవలి కాలంలో డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ‘లూసిఫర్’, ‘మరక్కర్’ చిత్రాలలో తన గాత్రానికి ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ అవార్డును కూడా గెలుచుకున్నాడు. తన సినిమాల్లో తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకున్నప్పటికీ, మరో పాత్రకు డబ్బింగ్ చెప్పుకునేటప్పుడు కొంచెం భయపడ్డానని వినీత్ గుర్తుచేసుకున్నాడు. ఇప్పుడు స్టార్ హీరోల చిత్రాల్లో కీలకపాత్రలు పోషిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, బాలకృష్ణతో సూపర్ హిట్ సినిమాలు.. 55 ఏళ్ల వయసులోనూ స్టిల్ సింగల్.. ఇప్పటికీ యూత్‏లో యమ క్రేజ్..