
హీరోయిన్స్ ఒక భాషకే పరిమితం కారు.. హీరోలంటే ఒకే భాషలో సినిమాలు చేస్తూ ఉంటారు మహా అయితే ఇంకో ఒక్క భాషలోచేస్తారు. కానీ హీరోయిన్స్ అలా కాదు. ఛాన్స్ వస్తే ఏ భాషలోనైనా తమ సత్తా చాటడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ మధ్య హీరోయిన్స్ దాదాపు అన్ని భాషల్లో సినిమాలు చేస్తున్నారు. పై ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ కూడా వివిధ భాషలో సినిమాలు చేసి అలరించింది. చేసిన అన్ని భాషల్లో టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. సైక్లింగ్ చేయడానికి సిద్ధం అవుతోన్న ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా..? టాలీవుడ్ లో దాదాపు అందరు హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోయిన్ గా మన దగ్గర ఓ వెలుగు వెలిగింది. ఇంతకు ఎవరో గుర్తుపట్టారా..?
పై ఫొటోలో మాస్క్ పెట్టుకొని సైక్లింగ్ కు రెడీ అయిన బ్యూటీ ఎవరో కాదు అందాల భామ త్రిష. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన త్రిష మొదట్లో హీరోయిన్ ఫ్రెండ్ రోల్స్ చేసింది. ఆ తర్వాత హీరోయిన్ గా మారి తెలుగు, తమిళ్, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో సినిమాలు చేసింది . తెలుగులో ప్రభాస్ నటించిన వర్షం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.
ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఈ మద్యే మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది., అలాగే పొన్నియన్స్ సెల్వన్ 2లో కూడా నటిస్తోంది. అదే విధంగా దళపతి విజయ్ నటిస్తున్న సినిమాలోనూ ఛాన్స్ దక్కించుకుంది. ఇక త్రిష నటించిన రాంగి అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..