‘బుట్టబొమ్మ’ మరో సెన్సేష‌న్..ఇంపాక్ట్ ఇప్ప‌ట్లో ఆగేలా లేదుగా..

|

May 31, 2020 | 5:41 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల కాంబోలో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ మూవీ సంక్రాంతికి విడుదలై సంచ‌ల‌న విజయాన్ని న‌మోదు చేసింది. ఇప్పటికే ఈ మూవీ రిలీజై నాలుగు నెలలు గడుస్తున్నా.. సోష‌ల్ మీడియాలో మాత్రం ఆ ఇంపాక్ట్ పోలేదు. సినిమాలోని సాంగ్స్ యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్ దక్కించుకుంటూ కొత్త రికార్డులు న‌మోదు చేస్తున్నాయి. ముఖ్యంగా ‘బుట్టబొమ్మ..’ అయితే ఓ సెన్సేష‌న్ అని చెప్పాలి. అందులో బన్నీ వేసిన స్టెప్పులకు సామాన్య ప్రేక్ష‌కులే […]

బుట్టబొమ్మ మరో సెన్సేష‌న్..ఇంపాక్ట్ ఇప్ప‌ట్లో ఆగేలా లేదుగా..
Follow us on

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల కాంబోలో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ మూవీ సంక్రాంతికి విడుదలై సంచ‌ల‌న విజయాన్ని న‌మోదు చేసింది. ఇప్పటికే ఈ మూవీ రిలీజై నాలుగు నెలలు గడుస్తున్నా.. సోష‌ల్ మీడియాలో మాత్రం ఆ ఇంపాక్ట్ పోలేదు. సినిమాలోని సాంగ్స్ యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్ దక్కించుకుంటూ కొత్త రికార్డులు న‌మోదు చేస్తున్నాయి. ముఖ్యంగా ‘బుట్టబొమ్మ..’ అయితే ఓ సెన్సేష‌న్ అని చెప్పాలి. అందులో బన్నీ వేసిన స్టెప్పులకు సామాన్య ప్రేక్ష‌కులే కాదు విదేశీ సెల‌బ్రిటీలు సైతం ఫిదా అవుతున్నారు. పలువురు బాలీవుడ్ స్టార్స్, క్రికెట్ ప్లేయ‌ర్స్ కూడా ఆ పాటకు తమదైన స్టైల్‌లో స్టెప్పులేసి అద‌రగొడుతున్నారు.

తాజాగా ఈ పాట మరో అరుదైన ఫీట్ అందుకుంది. యూట్యూబ్‌లో రిలీజైన‌ప్ప‌టి నుంచి ఈ పాటను ఇప్పటివరకు దాదాపు 200మిలియన్ల మంది వీక్షించారు. అంటే దాదాపు 20 కోట్ల మంది అన్న‌మాట‌. ఇటీవల కాలంలో తెలుగులోనే కాదు.. దక్షిణాదిలోనే ఈస్థాయి ఆదరణ దక్కించుకున్న గీతాల్లో ఒకటిగా ‘బుట్టబొమ్మ’ సాంగ్ నిలిచింది. ఈ పాటకు తమన్ మ్యూజిక్ అందించ‌గా.. రామజోగయ్య శాస్త్రి సాహిత్యమందించారు. అర్మాన్‌ మాలిక్ త‌న వాయిస్ తో శ్రోత‌ల‌ను మెస్మ‌రైజ్ చేశాడు.