Bubblegum OTT : ఓటీటీలోకి రొమాంటిక్ ఎంటర్టైనర్.. బ‌బుల్‌గ‌మ్ స్ట్రీమింగ్ ఎక్కడ..?ఎప్పుడంటే..?

|

Jan 26, 2024 | 10:21 AM

థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు నెలరోజులకు ఓటీటీలో రిలీజ్ అవుతుంటాయి. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమా ఓటీటీలో రిలీజ్ కానుంది. యాంకర్ గా సుదీర్ఘకాలంగా రాణిస్తున్న స్టార్ సుమ కనకాల కొడుకు రోషన్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. బాబుల్ గమ్ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు రోషన్. అంతకు ముందు శ్రీకాంత్ కొడుకు హీరోగా నటించిన నిర్మల కాన్వెంట్ సినిమాలో హీరో ఫ్రెండ్ గా నటించాడు.

Bubblegum OTT : ఓటీటీలోకి రొమాంటిక్ ఎంటర్టైనర్.. బ‌బుల్‌గ‌మ్ స్ట్రీమింగ్ ఎక్కడ..?ఎప్పుడంటే..?
Bubblegum
Follow us on

గత ఏడాది చాలా సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మెప్పించాయి. థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు ఆ తర్వాత ఓటీటీల్లోనూ అదరగొడుతున్నాయి. థియేటర్స్‌లో రిలీజ్ అయిన సినిమాలు నెలరోజులకు ఓటీటీలో రిలీజ్ అవుతుంటాయి. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమా ఓటీటీలో రిలీజ్ కానుంది. యాంకర్ గా సుదీర్ఘకాలంగా రాణిస్తోన్న స్టార్ సుమ కనకాల కొడుకు రోషన్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. బాబుల్‌గమ్ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు రోషన్. అంతకు ముందు శ్రీకాంత్ కొడుకు హీరోగా నటించిన నిర్మల కాన్వెంట్ సినిమాలో హీరో ఫ్రెండ్ గా నటించాడు. ఇక ఇప్పుడు సోలో హీరోగా సినిమా చేశాడు. బ‌బుల్‌గ‌మ్ డిసెంబ‌ర్ 29న ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ సినిమా యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.

ఈ సినిమాకు ర‌వికాంత్ పేరేపు దర్శకత్వం వహించాడు. గతంలో ఈయన అడవి శేష్ హీరోగా నటించిన క్షణం సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇక ఇప్పుడు బ‌బుల్‌గ‌మ్ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ సినిమాలో రోషన్‌కు జోడీగా మానస చౌదరి హీరోయిన్‌గా నటించింది. ఈ ఇద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో బ‌బుల్‌గ‌మ్ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఆహాలో బ‌బుల్‌గ‌మ్ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది అధికారిక ప్రకటన వచ్చేసింది. కానీ రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు. త్వరలోనే స్ట్రీమింగ్ డేట్ పై క్లారిటీ ఇవ్వనుంది ఆహా. థియేటర్ లో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

ఆహా ఓటీటీ ట్విట్టర్ లేటెస్ట్ పోస్ట్..

 సుమ కనకాల ట్విట్టర్ లేటెస్ట్ పోస్ట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.