
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రం బ్రో. ఈ సినిమా ట్రైలర్‌లో పవన్ కళ్యాణ్ చూసిన అభిమానులకు వింటేజ్ స్వాగ్ కనిపించింది. దీంతో ఆ వింటేజ్ పవన్ కళ్యాణ్‌ని థియేటర్స్‌లో ఎప్పుడు చూస్తామా? అని ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ శిల్ప కళా వేదికలో జరుగుతోంది. సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన సినిమా ‘బ్రో’. సోషియో ఫాంటసీ నేపథ్యంతో రాబోతున్న ఈ చిత్రంలో పవన్ మరోసారి దేవుడి పాత్రలో కనిపించబోతున్నాడు.
గతంలో ‘గోపాల గోపాల’ మూవీలో హాఫ్ టైం పవన్ మోడరన్ దేవుడిగా కనిపించి అలరించాడు. ఇప్పుడు ఈ సినిమాలో పూర్తి స్థాయిలో కనిపించి ఎంటర్టైన్ చేయనున్నాడు. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ ఆడియన్స్ లో మరింత అంచనాలు పెంచేసింది. సాధారణంగా ప్రీ రిలీజ్ వేడుకలు అంటే ఆరు నుంచి ఏడు గంటల లోపు మొదలు పెట్టడం ఆనవాయితీ. పెద్ద సినిమాలు ఇంకాస్త ఆలస్యం అవుతాయి. అయితే ‘బ్రో’ ప్రీ రిలీజ్ వేడుకను ఎనిమిదిన్నరకు ప్రారంభించనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వెల్లడించింది. ప్రజల సౌకర్యం, ట్రాన్స్‌పోర్ట్, భారీ వర్షాల కారణంగా ఏర్పడుతున్న ట్రాఫిక్ వంటి విషయాలను పరిగణలోకి తీసుకుని పవర్ ప్యాక్డ్ బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ సెలబ్రేషన్స్ రాత్రి 8.30 గంటలకు స్టార్ట్ చేస్తున్నారు.